Chin Tapak Dum Dum Meme: ‘ఛోటా భీమ్‘ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశంలోని చిన్నారులతో పాటు పెద్దలను విశేషంగా ఆకట్టుకున్న కార్టూన్ షో. బాల హనుమంతుడి గెటప్ లోని ఈ షో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. ఈ షోలోని 'చిన్ టపక్ డమ్ డమ్’ అనే డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘ఛోటా భీమ్‘ అభిమానులతో పాటు ఇతర నెటిజన్లు కూడా ఈ డైలాగ్ తో కూడిన టెంప్లేట్లను ఉపయోగిస్తున్నారు. ఇన్‌ స్టాగ్రామ్ రీల్స్‌ తో పాటు సోషల్ మీడియాలో ఫన్నీ కంటెంట్ ను క్రియేట్ చేస్తున్నారు.   


ట్రెండింగ్ లో ‘చిన్ టపక్ డమ్‘  


‘ఛోటా భీమ్‘లో నెగెటివ్ క్యారెక్టర్ టాకియా తరచుగా 'చిన్ టపక్ డమ్ డమ్’ అనే డైలాగ్ ను పలుకుతాడు. తను  మాయా శక్తులను ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఈ డైలాగ్ వాడుతాడు.  అది ఈ క్యారెక్టర్ సిగ్నేచర్ క్యాచ్‌ ఫ్రేజ్‌ గా మారిపోయింది. ‘ఛోటా భీమ్ - ఓల్డ్ ఎనిమీస్‘ సీజన్ 4, ఎపిసోడ్ 47ను ఓ అభిమాని మళ్లీ చూశారు. ఈ నేపథ్యంలో ఆయన 'చిన్ టపక్ డమ్ డమ్’  అనే డైలాగ్ ను వాడారు. నెమ్మదిగా ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఎపిసోడ్‌ లో  టాకియా ధోలక్‌పూర్‌లో తన గత దోపిడీలను గుర్తు చేసుకుంటాడు. ఈ ఎపిసోడ్ అంతటా, అతను తరచుగా 'చిన్ టపక్ డమ్ డమ్’ అనే డైలాగ్ వాడుతాడు.


నెట్టింట వైరల్ అవుతున్న 'చిన్ టపక్ డమ్ డమ్’ మీమ్స్


'చిన్ టపక్ డమ్ డమ్’ డైలాగ్ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు బోలెడు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టెంప్లేట్ తో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ సహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో విరివిగా వినియోగిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా అంతా  'చిన్ టపక్ డమ్ డమ్’ మీమ్ లు సందడి చేస్తున్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన ‘ఛోటా భీమ్‘


'ఛోటా భీమ్' అనేది యానిమేటెడ్ కామెడీ-అడ్వెంచర్ టెలివిజన్ సిరీస్. ధోలక్‌పూర్ వాసుల సమస్యలను పరిష్కరిస్తూ, వారి ప్రశంసలను పొందే ధైర్యవంతుడు, బలవంతుడు, తెలివైన చిన్న పిల్లవాడు ‘భీమ్‌‘ కేంద్రంగా ఈ కార్టూన్ సిరీస్ రూపొందించారు. ఈ కార్టూన్ షో కేవలం భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. 2019లో నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రారంభించినప్పటి నుంచి 27 మిలియన్లకు పైగా ఇళ్లలో చూసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్‌ లో నెట్‌ ఫ్లిక్స్‌ లో అత్యధికంగా వీక్షించిన కార్టూన్ సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది.


Read Also: కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూతపడుతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?



Read Also: అమెరికా వంతెన కూలిన ఘటనపై కార్టూన్, భారతీయుల్ని కించపరచడంపై నెటిజన్ల ఫైర్