జనవరి 28, బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ఫ్యామిలీ పలుకుబడి అందరికీ తెలుసు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఆయన తండ్రికి చిత్రసీమతో సంబంధాలు ఉన్నాయని తెలుసా? మొత్తం పవార్ కుటుంబం రాజకీయాల్లో లోతుగా మునిగిపోయినప్పటికీ... అజిత్ పవార్ తండ్రి భారతీయ సినిమాతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసా?

అజిత్ పవార్ తండ్రి ఎవరు?Who Is Ajit Pawar Father, Know His Background: అహ్మద్‌నగర్ జిల్లాలోని దేవ్‌లాలి ప్రవరాలో అజిత్ పవార్ జన్మించారు. ఆయనకు శరద్ పవార్ బాబాయ్. శదర్ సోదరుడు అనంత రావు పవార్‌, ఆశాతాయి పవార్ దంపతుల కుమారుడు అజిత్. ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. పవార్ కుటుంబంలోని చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అనంత రావు పవార్ సినిమాలతోనూ సంబంధాలు కలిగి ఉన్నారు.

Also Read: Politicians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

అజిత్ పవార్ తండ్రి, అనంత రావు పవార్‌ (Anantha Rao Pawar)కు భారతీయ సినీ పరిశ్రమతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాత వి. శాంతా రామ్‌తో కలిసి ఆయన పని చేశారు. ముంబైలోని వి. శాంతా రామ్ కు చెందిన 'రాజ్‌ కమల్ స్టూడియో'లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా అనంత రావు పని చేశారు. సినీ పరిశ్రమలో పనిచేసిన సమయంలో 'జానక్ జానక్ పాయల్ బాజే', 'అమర్ భూపాలి' వంటి అనేక పెద్ద సినిమా ప్రాజెక్టులకు సహాయ సహకాలు అందించారు.

Also Readఆరేళ్ళ వయసులో వేధింపులు... పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' హీరోయిన్ జీవితంలో చీకటి కోణం

ముంబైలో కొంతకాలం గడిపిన తరువాత బారామతికి తిరిగి వచ్చిన అనంత రావు కుటుంబ వ్యవసాయం, వ్యాపారాలు చూసుకున్నారు. ఆ తరువాత ఛత్రపతి కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి వైస్ - ఛైర్మన్‌గా నియమితులు అయ్యారు. ఆయన సోదరుడు శరద్ పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించగా... అనంత రావు సినిమా కెరీర్, స్థానిక సహకార పనులు చూసుకున్నారు. తండ్రి మరణం తరువాత అజిత్ పవార్ చదువు మానేశారు. కుటుంబ బాధ్యతలు స్వీకరించడం తప్ప ఆయనకు వేరే మార్గం లేదు.

Also Readమొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?