Why Arijit Singh Stopped Singing: బాలీవుడ్‌లో పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక మీదట కొత్త సినిమాలు అంగీకరించనని, పాడకూడదని తాను నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని, తనకు కొత్తదనం ఇష్టమని, అందుకే పాటలను ఎప్పుడూ ఒకేలా పాడనని, కొత్త గాయకుల పాటలు వినాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అర్జిత్ సింగ్ నిర్ణయం సంగీత ప్రియులతో పాటు ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది. అసలు అర్జిత్ సింగ్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

Continues below advertisement

Continues below advertisement

సింపుల్‌గా జీవించే అర్జిత్... కానీ ఒక్కో షోకు కోట్లు!

అర్జిత్ సింగ్‌ది చాలా సాధారణ జీవితం. ఎటువంటి లగ్జరీ కార్లు, హడావిడి లేకుండా ఎప్పుడూ సింపుల్‌గా ఉంటాడు. సొంతూరికి వెళ్లినప్పుడు స్కూటీపై సాధారణ బ్యాగ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు. వస్తువులు కొనడానికి వెళ్తాడు. చెప్పులు, షూలు అర్జిత్ సింగ్ సింప్లిసిటీని చెబుతాయి. కానీ ఇంత సాధారణ జీవితం గడిపే అర్జిత్ సింగ్‌కు కేవలం పాటలు పాడటం ద్వారా మాత్రమే కాదు... ఓరియన్ మ్యూజిక్ పేరుతో ఉన్న స్టూడియో, ఇంకా యూట్యూబ్, స్పాటిఫై, గానా వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుండి కోట్లు సంపాదిస్తున్నాడు.

Arijit Singh remuneration for concert: అర్జిత్ అనేక లైవ్ కాన్సర్ట్‌లు చేస్తాడు. వాటి కోసం రెండు గంటలకు 14 కోట్లు వసూలు చేస్తాడు. అలాగే చిన్న లేదా ప్రైవేట్ షోల కోసం 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు.

Arijit Singh remuneration per song: బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా... ఒక్కో పాటకు 10 నుండి 20 లక్షల రూపాయలు తీసుకుంటాడు అర్జిత్ సింగ్. అయితే హక్కులు, రాయల్టీ కలిపితే... ఆ రెమ్యూనరేషన్ మరింత పెరుగుతుంది. అంతే కాకుండా అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సాంగ్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కోట్ల రాయల్టీలను పొందుతాడు.

Also Readఆరేళ్ళ వయసులో వేధింపులు... పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' హీరోయిన్ జీవితంలో చీకటి కోణం

లల్లన్‌టాప్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో అర్జిత్ ఒక సింగిల్ షో కోసం 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని సంగీత దర్శకుడు మోంటీ శర్మ చెప్పారు. న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జిత్ రెండు గంటల షో కోసం 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని రాహుల్ వైద్య వెల్లడించాడు. అయితే ఈ విషయంపై అరిజిత్ ఎప్పుడూ స్పందించలేదు. ఓ ఇంటర్వ్యూలో అర్జిత్ ఒక షో కోసం ఎంత వసూలు చేస్తాడంటే, ఆ డబ్బుతో ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేయవచ్చని రఫ్తార్ చెప్పాడు.

Also Readమొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?

అర్జిత్ సింగ్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుంది?వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన అర్జిత్ సింగ్ దాదాపు 400 పాటలు పాడారు. వివిధ భాషల్లో అనేక లైవ్ షోలు కూడా చేశారు. అతని నికర విలువ కోట్లలో ఉండటం సహజం. లైవ్ మింట్ నివేదికల ప్రకారం... అర్జిత్ సింగ్ టోటల్ నెట్ వర్త్ (ఆస్తి విలువ) దాదాపు 414 కోట్ల రూపాయలు. ఇందులో నవీ ముంబైలోని అతని 8 కోట్ల ఇల్లు, 3.4 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అతని వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లకు చెందిన కార్లు ఉన్నాయి.

Also Read: Border 2 BO Day 5: 'ఆర్ఆర్ఆర్', 'కల్కి'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... సన్నీ డియోల్ సినిమా ఐదు రోజుల కలెక్షన్ ఎంతంటే?