యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన హిట్ సినిమా 'ఛత్రపతి'. దీనిని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Srinivas Bellamkonda) హీరో. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరికీ హిందీలో తొలి చిత్రమిది.


'ఛత్రపతి' హిందీ రీమేక్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయ్యింది. ఇటు హైదరాబాద్, అటు ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఎటువంటి కదలిక లేదు. అసలు, ఈ సినిమా ఎంత వరకు వచ్చింది? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


పది రోజులు షూటింగ్ చేస్తే 'ఛత్రపతి' హిందీ రీమేక్ కంప్లీట్ అవుతుంది. తెలుగు సినిమాను ఉన్నది ఉన్నట్టు తీయడం లేదని తెలిసింది. 'ఛత్రపతి' చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, హిందీ రీమేక్ కోసం కొన్ని మార్పులు చేశారు.  పాన్ ఇండియా రైటర్ ఆయన. ఆల్రెడీ హిందీ సినిమాలకు కథలు అందించిన అనుభవం ఉంది. అందుకని, హిందీ రీమేక్ స్క్రిప్ట్ సైతం విజయేంద్ర ప్రసాద్ చేతిలో పెట్టారు. అయితే... పెద్దగా మార్పులు చేయలేదట. సెకండాఫ్ మారిందని టాక్.
 
ఇటీవల 'ఛత్రపతి' హిందీ రీమేక్ నిర్మాత జయంతిలాల్ గడా రషెస్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారట. త్వరలో పది రోజులు షూటింగ్ చేసి... ఆ తర్వాత రిలీజ్ గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నారట.


Also Read : ఎన్టీఆర్ ఏడాది క్రితమే హైదరాబాద్ శివార్లలో ఆ ల్యాండ్ కొన్నారు - ఇప్పుడు అక్కడ


'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వి.వి. వినాయక్... 'ఛత్రపతి' రీమేక్‌తో అతడిని హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు జానీ లివర్ ఓ రోల్ చేస్తున్నారు. 


Also Read: రష్మీ గౌతమ్ పెళ్లి కుదిరింది, బావ వచ్చేస్తున్నాడు