We Love Bad Boys first look featuring 18 actors: అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్ వంటి యువ తారలు నటించిన సినిమా 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్'. ఇందులో సన్యు దవలగర్, వంశీ కృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ఇతర ముఖ్య తారాగణం. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. నూతన నిర్మాణ సంస్ధ బిఎమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గా రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


ప్రేమికుల రోజు కానుకగా ఫస్ట్ లుక్
ప్రేమికుల రోజు సందర్భంగా ఇవాళ 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే హీరో హీరోయిన్లవి విడుదల చేస్తారు. బట్, ఫర్ ఎ ఛేంజ్.... సినిమాలో ఉన్న మెజారిటీ ఆర్టిస్టులను ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' దర్శక నిర్మాతలు చూపించారు. మొత్తం మీద 18 మంది ఆ పోస్టర్‌లో ఉన్నారు.


Also Read: ఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!


'వి లవ్ బ్యాడ్ బాయ్స్' సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. 'కడుపుబ్బే ఎంటర్‌టైనర్‌'గా సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది.



త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం - దర్శక నిర్మాతలు
అతి త్వరలో 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ''పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనాథ్, ఆలీ,  సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, శివా రెడ్డి, 'భద్రం', గీతా సింగ్ తదితరులు సైతం మా సినిమాలో నటించారు. భారీ తారాగణంతో తీసిన చిత్రమిది. కథ, కథనాల విషయానికి వస్తే... ఈతరం యువతీ యువకుల మనోభావాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ట్రెండీగా ఉంటుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొందరు మమ్మల్ని ప్రశంసించారు. మా నిర్మాణ సంస్థకు ఈ సినిమా శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.


Also Read తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కల్ట్ లవ్ స్టోరీలు ఇవే - ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రాలు


'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్' చిత్రానికి రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవి కుమార్ - శ్రీమన్నారాయణాచార్య (విరాట్) గానం: రఘు కుంచె - గీతా మాధురి - లిప్సిక - అరుణ్ కౌండిన్య - మనోజ్ శర్మ కుచి, కూర్పు: నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే & మాటలు: ఆనంద్ కొడవటిగంటి, ఛాయాగ్రహణం: వి.కె. రామరాజు, సమర్పణ: శ్రీమతి పప్పుల వరలక్ష్మి, నిర్మాత: పప్పుల కనకదుర్గారావు, నిర్మాణం: బిఎమ్ క్రియేషన్స్, రచన - దర్శకత్వం: రాజు రాజేంద్రప్రసాద్.