NTR's War 2 Telugu Review: 'వార్ 2'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి వైఆర్ఎఫ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ నుంచి ఎటువంటి టాక్ లభించింది? ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయ్? అనేది ఒక్కసారి చూడండి. 

హీరోస్ ఎంట్రీలు సూపర్...ఇంటర్వెల్ వరకు పర్లేదు కానీ!ఎన్టీఆర్, హృతిక్ రోషన్... 'వార్ 2'లో హీరోలు ఇద్దరి ఎంట్రీలు అదిరిపోయాయని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు సినిమా ఓకే అని టాక్. అయితే అక్కడ నుంచి మధ్య మధ్యలో కొంత స్లో డౌన్ అయ్యిందని టాక్. అమెరికాలోని కొన్ని థియేటర్లలో ఎన్టీఆర్ ఎంట్రీకి విజిల్స్, పేపర్స్ పడ్డాయి.

Also Read: కుర్చీ కోసం యుద్ధం... మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్... స్పాయిలర్స్‌ లేకుండా రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ మినీ రివ్యూ

అదిరిపోయిన హీరోస్ ఇంట్రడక్షన్ తర్వాత సినిమా రెగ్యులర్ స్పై థ్రిల్లర్ మూవీస్ టెంప్లేట్‌లోకి వెళ్లిందని జనాలు చెబుతున్నారు. అయినా సరే ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్లిందట. ఆ తర్వాత కిందకు పడుతూ పైకి లేస్తూ వెళ్లిందట. అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదుర్స్ అంటున్నారు జనాలు. ఆయన కుమ్మేశారట. ఈ సినిమాతో హృతిక్ రోషన్ తెలుగు జనాలకు దగ్గర అవుతారని చెబుతున్నారు. కియారా అద్వానీ బికినీ సీన్స్, ఎన్టీఆర్ - హృతిక్ డ్యాన్స్ నంబర్ బావుందట.

Also Read: 'వార్ 2' ఓపెనింగ్ అంచనా... వసూళ్ల సునామీ ఖాయమా? ఫస్ట్ డే 100 కోట్లు వస్తాయా? ఎన్టీఆర్‌ 'దేవర'ను బీట్ చేస్తుందా?

హృతిక్‌ను వలలో వేసిన కియారా...రోగ్ ఏజెంట్ మీద ఏజెంట్ విక్రమ్ ఫైట్!'వార్' సినిమా చూసిన జనాలకు కథ గుర్తుండి ఉంటుంది. రా ఏజెంట్ కబీర్ రోల్ చేశారు హృతిక్ రోషన్. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాడు. కొన్ని పరిస్థితుల తర్వాత రోగ్ ఏజెంట్ కింద మారతాడు. దేశానికి ఎదురు తిరుగుతాడు. 'వార్ 2' అతడిని వలలో వేసిన పాకిస్తానీ ఏజెంట్ రోల్ కియారా చేసినట్టు సోషల్ మీడియాలో కొందరు రాస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఆవిడ ఇండియన్ ఆర్మీ అన్నట్టు ఉంది. కబీర్ మీద విక్రమ్ (ఎన్టీఆర్) ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది 'వార్ 2' సినిమా.  

'వార్ 2' బ్లాక్ బస్టర్... సాలిడ్ ఎంటర్‌టైనర్!'వార్ 2' బొమ్మ బ్లాక్ బస్టర్ అంటోంది ట్విట్టర్ లోకం. ఇదొక సాలిడ్ ఎంటర్‌టైనర్ అని పలు పోస్టులు కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్లకు తోడు సినిమాలో ట్విస్ట్ & టర్న్‌లు సూపర్ ఉన్నాయట. స్పాయిలర్స్ తెలుసుకోకుండా సినిమాకు వెళ్లడం మంచిదని ఫ్యాన్స్ కొందరు చెబుతున్నారు. కొందరి నుంచి నెగెటివ్ టాక్ సైతం వినబడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే టాక్ బట్టి నెక్స్ట్ ఫుట్ ఫాల్స్ డిసైడ్ అవుతాయి.