మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు 'వార్ 2' టీజర్ (War 2 Teaser) నచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు లుక్ స్టైలిష్‌గా ఉంది. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా సినిమా సాగుతుందని అర్థం అవుతోంది. కానీ టీజర్ ఒక్క విషయంలో డిజప్పాయింట్ చేసింది. వీఎఫ్ఎక్స్ అసలు బాలేదని ట్విట్టర్ అంతా హోరెత్తుతోంది.
90 ఎంఎం రాడ్...గ్రీన్ మ్యాట్ మీద తీశారా?'వార్ 2' చిత్రీకరణ కోసం వివిధ దేశాలు తిరిగామని సినిమా యూనిట్ చెబుతోంది. కానీ టీజర్ చూస్తే అలా లేదని టాలీవుడ్ ట్విట్టర్ యువత నిరాశ వ్యక్తం చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ vfx చూడలేదని కొంత మంది పోస్టులు చేస్తున్నారు. 90 ఎంఎం రాడ్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు
'వార్ 2' టీజర్‌లో ట్రైన్ మీద ఎన్టీఆర్ దూకే సీన్ ఉంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అసలు బాలేదు అనేది ప్రధానంగా వినిపించే విమర్శ. అలాగే టీజర్‌లో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ట్రోల్ అవుతోంది. హృతిక్ పక్కన యానిమల్ వీఎఫ్ఎక్స్ సరిగా కుదరలేదని పోస్టులు చేస్తున్నారు. మంచు గుహలో హృతిక్ ఎన్టీఆర్ ఫైట్ మధ్యలో సీజీ వర్క్ కూడా ట్రోలింగ్‌కి గురయింది. వార్ 2 టీజర్ మీద నెటిజన్స్ రియాక్షన్స్ చూడండి.
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?