Ram Charan In Indra Movie Set: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సంబరాలు మొదలయ్యాయి. రేపు (ఆగస్టు 22) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మొత్తం చిరంజీవి సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. ఆయన త్రోబ్యాక్ ఫోటోలు, హిట్ సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ని షేర్ చేస్తున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌లో ఒకటైన ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంద్ర సినిమాకు సంబంధించిన హైలెట్ సీన్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంద్ర మేకింగ్ వీడియో
ఇదిలా ఉంటే ఈ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ చిత్రంలోని హిట్ సాంగ్ అమ్మడు అప్పచ్చి పాట మేకింగ్ వీడియోను వైజయంతీ మూవీస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతంది. అయితే ఈ వీడియోకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాట మేకింగ్ టైంలో సెట్‌లో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ కొణిదెల కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంద్ర మేకింగ్ వీడియో మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
కాగా మెగాస్టార్ చిరంజీవి నటించి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఇంద్ర కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతాఇంత కాదు. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మూవీలో చిరంజీవి నటించిన తొలి చిత్రమిది. ఇందులో ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషిలు విలన్లుగా నటించిన ఈ చిత్రం కథ, కథనం, డైలాగ్స్ , మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.
టీనేజ్ లుక్ లో చరణ్
ఇందులో దాయి దాయి దామ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఇందులో వీణా సిగ్నేచర్ స్టెప్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ఆ తర్వాత అంతటి రెస్పాన్స్ అందుకుంది అమ్మము అప్పచ్చి సాంగ్. రేపు ఇంద్ర రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాలోని అమ్మడు అప్పచ్చి పాట మేకింగ్ వీడియో రిలీజ్ చేసి మూవీపై మరింత హైప్ పెంచింది వైజయంతీ మూవీస్ సంస్థ. ఇందులో సెట్‌లో రామ్ చరణ్, శ్రీజ, వరుణ్ తేజ్ కొణిదెలు కూడా ఉండటంతో ఈ వీడియో మరింత ప్రత్యేకతను తెచ్చుకుంది. అప్పుడు చరణ్ టీనేజ్ వయసులో కనిపించాడు. యంగ్ కుర్రాడిలా తండ్రి డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నిర్మాత అశ్వినీ దత్‌తో సీరియస్‌గా డిస్కషన్ చేస్తూ కనిపించాడు.
తండ్రి మూవీ సెట్‌లో ఈ గ్లోబల్ స్టార్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. 2002 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా కేవలం పదికోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ మొత్తం రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని అప్పటి వరకు దక్షిణాదిలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తొలి చిత్రంగా నిలిచి రికార్డు నెలకొల్పింది. అప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పడయప్ప (తెలుగులో నరసింహ) మూవీ పేరిట ఉన్న ఈ రికార్డును మెగాస్టార్ అధిగమించారు. నెక్ట్స్ మహేశ్ బాబు 'పోకిరి' చిత్రం వరకు ఇంద్ర రికార్డు మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది.
Also Read: యాంకర్ రష్మీ ఇంట విషాదం - సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్