Anchor Vishnu Priya Faces Another Controversy : ప్రముఖ యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ ఫేం విష్ణుప్రియ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్‌గా ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్‌తో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు విష్ణుప్రియపై పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఆ వివాదం మరువక ముందే మరో కాంట్రవర్సీ వైరల్ అవుతోంది.
ఓపెన్‌గా చెప్పేసిన విష్ణుప్రియ
లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియోలో బోల్డ్ కామెంట్స్ చేసిందంటూ విష్ణుప్రియపై ట్రోలింగ్ సాగుతోంది. నిజానికి సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ కాంట్రవర్సీకి ముందు ఆమెకు ఫాలోవర్స్ వందల్లో ఉండగా... వివాదం తర్వాత అమాంతం పెరిగారు. తాజాగా తన సబ్‌స్కైబర్స్‌తో లైవ్‌లో పాల్గొన్న విష్ణుప్రియ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అందులో సబ్ స్క్రైబర్స్ ప్రశ్నలకు ఆమె సమాధానం కూడా చెప్పినట్లుగా ఉంది.
ఓ సబ్‌స్క్రైబర్ విష్ణుప్రియను 'మీ బాడీ కౌంట్ ఎంత?' అని ప్రశ్నించగా... ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా 'నా బాడీ కౌంట్ ఫైవ్' అంటూ ఆన్సర్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. (బాడీ కౌంట్ ఇప్పటివరకూ ఎంతమందితో శారీరక సంబంధం పెట్టుకున్నారు? అని అర్థం).
Also Read : Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్
ట్రోలింగ్స్‌తో పాటే సపోర్ట్...
ఈ వీడియోపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా ట్రోలింగ్ సాగుతోంది. ఆమె కామెంట్స్‌ను కొందరు తీవ్రంగా విమర్శిస్తుండగా... మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అశ్లీల కంటెంట్ పోస్ట్ చేయడమే కాకుండా ఇలాంటి క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ చెప్పి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని కొందరు ప్రశ్నిస్తుండగా... మరికొందరు మాత్రం ఆమె పర్సనల్ లైఫ్, ఆమె ఇష్టమని అంటున్నారు. ఇలాంటి అసభ్య పదజాలం, కంటెంట్ బ్యాన్ చేయాలని కొందరు కోరుతున్నారు.
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ టీవీ షోల ద్వారా ఫుల్ ఫేం సంపాదించుకున్నారు. పోవే పోరా షోలో తనదైన చలాకీతనం, యాంకరింగ్‌తో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో పాటు కామెడీ క్లబ్, WOW వంటి షోలకు యాంకరింగ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేశారు. సోషల్ మీడియా, యాంకరింగ్ ఫేమ్‌తో బిగ్ బాస్ సీజన్ 8లో కంటెంస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్నారు.
Also Read : Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
