Ram Charan's Peddi Hellallallo Video Song Out : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ రిలీజ్ చేయగా... ఐటమ్ సాంగ్ హల్లల్లల్లో ఫుల్ వీడియో వచ్చేసింది. 

Continues below advertisement

ట్రెండింగ్ To కాంట్రవర్సీ

రిలీజ్‌కు ముందు ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యింది. రామ్ చరణ్‌తో శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ స్టెప్పులేశారు. అనంత శ్రీరామ్ రొమాంటిక్ టచ్ లిరిక్స్ అందించగా... రక్షిత సురేశ్ పాడారు. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈ పాట ఎంత ట్రెండ్ అయ్యిందో లిరిక్స్‌పై అంతే విమర్శలు వచ్చాయి. హీరోయిన్ జాన్వీ కపూర్‌ను చూపించిన తీరుపై కూడా అంతే ట్రోలింగ్ సాగింది.

Continues below advertisement

Also Read : Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్

లిరిసిస్ట్ రియాక్షన్

ఈ పాటపై వస్తోన్న విమర్శలపై రీసెంట్‌గా సక్సెస్ మీట్‌లో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్‌లా ఆస్వాదించిన వాళ్లకు ఓ స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్లు. ఐటమ్ సాంగ్‌లా ఆస్వాదించని వాళ్లు పెద్ది ఐటమ్ గాళ్ల కిందే లెక్క.' అని అన్నారు. పాటలో లిరిక్స్‌పై వచ్చిన ట్రోలింగ్స్‌పై కూడా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

హల్లల్లల్లో సాంగ్ లిరిక్స్ 

బారలుంటాయ్ బంకులుంటాయ్ బంగారాలుంటాయ్...

బాధలుంటాయ్.. బాకీలుంటాయ్... భారాలుంటుంటాయ్... 

మనిషన్నవోడికివి మామూలే... ప్రతిపూట తప్పని పేచీలే... 

అడపాదడపా ఇడిసెయ్ గడపా... ఏటి పీపీలయిపోతావ్ అతిగా...

వారానికి వెయ్యి... నాకోసం దాయి... నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...

అరకాసులు తియ్యి... అరవంకీలేయి... స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...

అందం బిందులున్నాయ్ దా దా దా... ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో... 

చరణం 1 

ఇంట్లో వంటే తింటుంటావా... 

హోటల్‌కో దాబాకో ఓసారెల్లిముద్ద మింగి రావా... 

హే ఇంట్లో తానం సాలంటావా... 

పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్లో మునక మనిగి రావా... 

ఇది కూడా అంతేరో... ప్రతివారం సంతేరో... 

అది కూడా వగ్గేత్తే  పుట్టిందింకెందుకురో... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో... 

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో..

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

చరణం 2 

నెమరేసుకోనాకైనా... వివరీసు లేకుంటే ఎల్గా... ఎల్గా...

ఎనకూళ్లోఅననాకైనా వేశాలేవీ లేకుంటే ఎల్గా... అల్గా...

సుఖమిట్టా పోగెసెయ్... ఇప్పుడే అది ఎనకేసెయ్... 

ముసలాడైపోయాక మురిపెంగా నెమరేసెయ్... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో... 

బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో... 

వారానికి వెయ్యి... నాకోసం దాయి...

నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...

అరకాసులు తియ్యి... అరవంకీలేయి...

స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...

అందం బిందులున్నాయ్ దా దా దా...

ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

Also Read : Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.400 కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు తీస్తోంది. చరణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీగా నిలిచింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన  సినిమాలో చరణ్, జాన్వీలతో పాటు శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.