ఫహాద్ ఫాజిల్... మలయాళంలో స్టార్ హీరో. ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప'లో ఆయన విలన్ రోల్ చేశారు. ఆ సినిమాతో సంబంధం లేకుండా ఫహాద్ మలయాళ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. వాళ్లకు నచ్చిన సినిమాలలో 'ఆవేశం' ఒకటి. ఆ సినిమాను విష్ణు మంచు ఒక రీమేక్ చేయాలని అనుకున్నారు.
'ఆవేశం' నచ్చింది... రీమేక్ చేయాలనుకున్నా కానీ!?Vishnu Manchu on Aavesham Telugu remake: 'కన్నప్ప' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తనకు 'ఆవేశం' నచ్చిందని విష్ణు మంచు తెలిపారు. తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలని ట్రై చేసినట్లు పేర్కొన్నారు. అయితే రీమేక్ రైట్స్ వేరొకరి దగ్గర ఉన్నాయని తెలిసిందని, దాంతో ఆ సినిమాను తెలుగులో చేయడం కుదరలేదని ఆయన తెలిపారు.
ఇటీవల మళయాళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. సాధారణంగా మలయాళ సినిమాలు కేరళలో విడుదలైనా... ఓటీటీకి వచ్చేసరికి తెలుగులో డబ్బింగ్ చేస్తారు. 'ఆవేశం' సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయలేదు. థియేటర్లలో కాదు... ఓటీటీలోనూ ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.
'ఆవేశం' సినిమా రీమేక్ చేయాలని టాలీవుడ్ హీరోలు కొందరు ట్రై చేసిన మాట వాస్తవం. అయితే రీమేక్ రైట్స్ ఒకరి దగ్గర ఉండటం, వాళ్ళ ఓ హీరోతో రీమేక్ చేయాలని అనుకోవడం వల్ల ఏం చేయలేకపోతున్నారు. మోహన్ బాబు హీరోగా 'ఆవేశం'ను రీమేక్ చేయాలని అనుకున్నారా? లేదంటే తాను హీరోగా నటించడం కోసం ట్రై చేశారా? అనేది విష్ణు మంచు చెప్పలేదు అయితే తెలుగు ప్రేక్షకులు చాలా మంది గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణకు 'ఆవేశం'లో ఫహాద్ ఫాజిల్ చేసిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చెబుతున్నారు.
జూన్ 27న 'కన్నప్ప' థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో విష్ణు మంచు బిజీగా ఉన్నారు. ఇటీవల తండ్రి మోహన్ బాబుతో కలిసి చెన్నై వెళ్ళిన విష్ణు మంచు... సూపర్ స్టార్ రజనీకాంత్ కు 'కన్నప్ప'ను చూపించారు. సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ అంకుల్ తనకు టైట్ హాగ్ ఇచ్చారని, ఆ కౌగిలింత కోసం 20 ఏళ్ల నుంచి తాను వెయిట్ చేస్తున్నానని విష్ణు మంచు తెలిపారు. ఈ సినిమా హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు రాజస్థాన్‌లో జరుగుతుంది.