సినిమాల విషయంలో ఆడియన్స్ జడ్జ్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్కోసారి భారీ హోప్స్ తో థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోతాయి. ఒక్కోసారి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతూ ఉంటాయి. థియేటర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ఓటీటీలో నిరాశ పరిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకు ‘కెజీఎఫ్’, ‘కాశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు కలెక్షన్స్ లో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. కానీ తీరా ఓటీటీ లోకి వచ్చాక వీటిని ఎవరూ పట్టించుకోలేదు.
ఇక మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో హిట్ అవ్వకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను కనబరుస్తాయి. తాజాగా అలాంటి ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ఆ సినిమా పేరే 'వర్జిన్ స్టోరీ'. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం 2022 ఫిబ్రవరి నెలలో విడుదలవ్వగా.. ఆ సమయంలో ఆడియన్స్ ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. అటు రివ్యూలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఇదే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
నూతన దర్శకుడు ప్రదీప్ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 21 నుంచి 'ఆహా' ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఆహాలో 10 మిలియన్ల వ్యూస్ అందుకొని భారీ రెస్సాన్స్ తో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్పామ్స్ లో హిట్ గా నిలిచిన చిన్న సినిమాల లిస్ట్ లో 'వర్జిన్ స్టోరీ'సినిమా కూడా చేరడం విశేషం. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ మెప్పు పొందని ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతుండటంతో మూవీ టీమ్ ఎంతో ఆనందం గా ఉంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించాడు.
దీనికంటే ముందు దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన 'రౌడీ బాయ్స్ ' సినిమాలో నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. సినిమాలో మెడికల్ కాలేజ్ సీనియర్ గా హీరోకి సమానమైమ రోల్ లో నటించి మెప్పించాడు. ఈ మూవీలో ఆశిష్ రెడ్డి, విక్రమ్ సాహిదేవ్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అలా రౌడీ బాయ్స్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న విక్రమ్.. వర్జిన్ స్టోరీ సినిమాతో హీరోగా మారాడు. సౌమిక పాండ్యన్, రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించారు. రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి నిర్మించగా.. అచ్చు, హరి గౌర సంగీతం అందించారు. ఇప్పటికే ఆహా ఓటీటీలో 10 మిలియన్ల వ్యూస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ముందు ముందు ఇంకెలాంటి రికార్డ్స్ ని అందుకుంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాని ఎవరైనా థియేటర్లో మిస్ అయితే ప్రస్తుతం ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది చూసేయండి.
Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే!