విక్రాంత్ (Vikranth)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ... డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ L.I.F.E' (Spark Movie). ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ కథానాయికలు. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో విక్రాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
నవంబర్ 17న 'స్పార్క్'
Spark Movie Release Date : నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్పార్క్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read : 'కింగ్ ఆఫ్ కొత్త' రివ్యూ : యాక్షన్ హీరోగా దుల్కర్ సల్మాన్ హిట్ అందుకుంటారా? లేదా?
'స్పార్క్'లో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన విక్రాంత్ తొలి చిత్రమిది. ఆతను కొత్తవాడు అయినప్పటికీ... టీజర్ చూస్తే ఇదొక చిన్న సినిమా అని ఎక్కడా అనిపించలేదు. భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు అర్థం అవుతోంది. పైగా, టీజర్ స్టార్టింగులోనే యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పారు. నేలపై వరుసగా పడి ఉన్న శవాలు, ఆ తూటాలు చూస్తే... హీరో వాళ్ళను షూట్ చేసినట్లు అర్థం అవుతోంది. తర్వాత సన్నివేశాల్లో హీరో వెంట పోలీసులు పడటం, ఫైరింగ్ వంటివి చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రేమ, యాక్షన్, ప్రతీకారం సినిమాలో ఉన్నాయని టీజర్ ద్వారా చెప్పారు.'స్పార్క్' చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఒక విధంగా చెప్పాలంటే... ఆయన అంగీకరించిన తొలి తెలుగు సినిమా కూడా ఇది. టీజర్ అంతా ఓ ఎత్తు... అందులో నేపథ్య సంగీతం మరో ఎత్తు.
Also Read : 'బెదురులంక' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - కార్తికేయ ముందున్న కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లీష్ సాహిత్యంతో కూడిన పాటకు హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్లలో నేపథ్య సంగీతం కూడా! 'స్పార్క్'తో పాటు విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకు కూడా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఆ సినిమా పాటలు హిట్ అయ్యాయి.
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట! 'స్పార్క్'లో నాజర్, సుహాసిని మణిరత్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial