Vijayendra Prasad: దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సక్సెస్ వెనుక తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర చాలానే ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్ బాబుతో చేస్తున్న స్క్రిప్ట్ పనుల్లో విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన.. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలా మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్.. ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉన్నా కూడా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ మాత్రం చాలానే జరిగాయి. తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు.


ప్రాధాన్యత విషయంలో విమర్శలు..


‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ లభించింది. కానీ మూవీ విడుదల అయినప్పుడు మాత్రం రాజమౌళి.. ఎన్‌టీఆర్ కంటే రామ్ చరణ్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శించారు. క్లైమాక్స్ ఫైట్ సమయంలో రామ్ చరణే రాముడిగా అవతారమెత్తి విలన్స్‌తో ఫైట్ చేశాడని, ఎన్‌టీఆర్ మాత్రం ఒక కొలనులో దాక్కున్నాడని నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలలో తనకు రామ్ చరణ్ పాత్రే ఎక్కువగా నచ్చిందని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాయి. ఇప్పుడు కూడా మరోసారి ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో అలాంటి ఒక స్టేట్‌మెంటే ఇచ్చి మళ్లీ కాంట్రవర్సీలకు కారణమయ్యారు. 


కథ రాసుకున్నప్పుడు ఒక్కటే..


‘‘నేను ఏ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలని అనుకోవడం లేదు. నేను కథ రాసుకుంటున్నప్పుడు రెండు పాత్రలు ఒకేలాగా అనిపించాయి. కానీ సినిమా చూసిన తర్వాత అది కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. రామ్ చరణ్ పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎన్‌టీఆర్ పాత్రలో అమాయకత్వం మాత్రమే ఉంది. ఎన్‌టీఆర్ గొప్ప నటుడు. తనకు ఏ పాత్ర ఇచ్చినా సూపర్‌గా నటిస్తాడు. ఆర్ఆర్ఆర్‌లో తను పోషించిన పాత్ర చాలా కష్టమైనది. ఆ పాత్ర వల్లే కథ ముందుకు వెళ్తుంది. రామ్ చరణ్ క్యారెక్టర్‌ను రాముడిలాగా చూపించాలని మేము అనుకోలేదు. రామరాజులాగా చూపించాము. కానీ అది రాముడిలాగా అనిపించింది. రాముడి ప్రభావం కాస్త ఎఫెక్ట్ చూపించింది’’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్.


ఏకంగా ఆస్కార్ లెవెల్‌లో..


ఒక రైటర్‌గా తన అభిప్రాయం ఏంటో చెప్పారు విజయేంద్ర ప్రసాద్. కానీ ఈ వ్యాఖ్యలు చాలావరకు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్ పాత్ర గురించి, తన నటన గురించి ఆయన గొప్పగానే మాట్లాడినా కూడా పాత్రల ప్రాముఖ్యత విషయంలో మాత్రం రామ్ చరణ్‌కే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్టుగా ఆయన కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నారని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అందించిన ఘనత ‘ఆర్ఆర్ఆర్’కు దక్కింది. ఆఖరికి సినిమా విడుదలయ్యి గుర్తింపు సాధిస్తున్న సమయంలో కూడా ‘గ్లోబల్ స్టార్’ అనే ట్యాగ్ కోసం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవలుపడ్డారు.


Also Read: మహేష్ - రాజమౌళి మూవీ, అసలు కథ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్