Vijya Sethupathi Role In Puri Jagannadh Movie: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు విజయ్. తాజాగా ఈ మూవీ గురించి ఓ లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.

విజయ్ సేతుపతి రోల్ అదేనా?

ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి స్టోరీ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. విజయ్ రోల్‌పైనా అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పూరీ ఈ మూవీని తీయబోతున్నారట. విజయ్ పాత్రలో మూడు కోణాలుంటాయని... ఓ కోణంలో ఆయన నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై మూవీ టీం స్పందించాల్సి ఉంది.

మరోవైపు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూవీలో లాంగ్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో క్లైమాక్స్ సీన్‌తో పాటు విజయ్ సేతుపతిపై ఓ సోలో సాంగ్ కూడా షూట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: 'భోళా శంకర్' మూవీ రిజల్ట్ - ప్రొడ్యూసర్‌ను చూసి జాలిపడ్డ క్లర్క్... ఆ స్టోరీ ఏంటో తెలుసా?

ఈ మూవీలో విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా... కీలక సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. 

నిజానికి 'ఉప్పెన' తర్వాత విజయ్ సేతుపతి నేరుగా తెలుగులో మూవీ చేయలేదు. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు ఎన్నో కథలు చెప్పినా ఆయన ఓకే చెప్పలేదు. చివరకు పూరీ జగన్నాథ్ చెప్పిన స్క్రిప్ట్‌కు సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేయడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దీంతో ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ హిట్స్, ప్లాప్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని... స్టోరీ బాగుండడంతోనే ఓకే చెప్పానని గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు. పూరీ అంటే మనకు మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది. తాజా మూవీలో హ్యూమన్ యాంగిల్‌లోనూ స్క్రిప్ట్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 

టైటిల్‌పైనా ఆసక్తి

అటు ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం సాగినా... అందులో నిజం లేదని విజయ్ ఓ ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో టైటిల్ కూడా ఏంటి అనేది ఇంట్రెస్ట్ నెలకొంది. గత కొంతకాలంగా పూరీ ఖాతాలోనూ సరైన హిట్ పడలేదు. ఈ మూవీతోనైనా ఆయన కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అటు, అటు, మహారాజ సినిమా  తర్వాత విజయ్ ఖాతాలోనూ సరైన హిట్ లేదు. రీసెంట్‌గా వచ్చిన ఏస్, తలైవన్ తలైవి కాస్త పర్వాలేదనిపించాయి. ఈ మూవీతో మంచి హిట్ అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.