గత ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్ లో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండను ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆడియన్స్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అటు 'ఇస్మార్ట్ శంకర్' తో చాలా ఏళ్ల తర్వాత భారీ కం బ్యాక్ అందుకున్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో ఇండస్ట్రీకి ఓ పెద్ద మాస్ హిట్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. విడుదలకు ముందు లైగర్ టీం కాన్ఫిడెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది.
ఈ సినిమా కలెక్షన్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందంటూ అన్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి మాటలు, ప్రమోషన్స్ తో భారీ స్థాయిలో అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద చతికలబడ్డ ఈ సినిమా ఆ తర్వాత డిజాస్టర్ గా నిలిచింది. ఇక లైగర్ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాని ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎర్లీ మార్నింగ్ షోల తోనే తేలిపోవడంతో విజయ్ దేవరకొండ సైలెంట్ అయ్యాడని తాజాగా ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
తాను నటించిన 'బేబీ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "లైగర్ రిజల్ట్ ఏంటో ఎర్లీ మార్నింగ్ షోస్ అయ్యేసరికి అందరికీ అర్థమయిపోయింది. ఇంకా ఈ సినిమాను మనం జనాల మీదకి రుద్దాలి అనే ఇంటెన్షన్ ను అన్న పక్కన పెట్టేసాడు. శారీరకంగా, మానసికంగా సినిమా కోసం మనం ఇంత కష్టపడ్డాం అని బాధపడడం కూడా మానేసి ఆగస్టు 25 సాయంత్రం నుంచి 'ఖుషి' మూవీ కోసం ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. అన్న సినిమాలు ప్లాప్ అయినా కూడా తన ఎఫర్ట్స్ మీద ఎవరు వేలెత్తి చూపలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక 'బేబీ' సినిమా విషయానికొస్తే.. 'కలర్ ఫోటో' వంటి జాతీయ అవార్డు అందుకున్న సినిమాకు కథను అందించిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించారు. స్కూల్, కాలేజ్ డేస్ ల్ సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందనను రాబట్టాయి. కేవలం పాటలతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై యువ నిర్మాత SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.
Also Read : శ్రీ విష్ణు 'సామజవరగమన' పై బన్నీ ప్రశంసలు - ఇది అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial