Vijay Deverakonda Rashmika In India Day Parade: యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అమెరికాలో సందడి చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌లో వారు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పరేడ్‌కు వారు 'గ్రాండ్ మార్షల్'గా వ్యవహరించారు. ఇందులో పాల్గొన్న వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది.
వీడియోలు వైరల్
వీరిద్దరూ పరేడ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడవడంతో ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. దారి పొడవునా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ పరేడ్‌లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
చాలా రోజుల తర్వాత విజయ్, రష్మిక కలిసి కనిపించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఎంతోకాలంగా సాగుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు, హోటల్స్‌కు కలిసి వెళ్లగా ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. దీంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. తాజాగా ఇద్దరూ కలిసి పరేడ్‌లో మరోసారి కలిసి కనిపించడంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి.
Also Read: కూలీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... రజనీకాంత్ మూవీ హిట్టేనా? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ప్రతి ఏటా ప్రపంచంలో అతిపెద్ద భారతీయ పరేడ్ న్యూయార్క్‌లో నిర్వహిస్తారు. ఈ ఏడాదికి రష్మిక, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల కోసం 1970లో FIAను స్థాపించారు. ఇది ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్ షైర్, మైన్, వెర్మాంట్ రాష్ట్రాల్లో భారతీయ సంప్రదాయాన్ని నిర్వహిస్తుంది. ఇండియన్ ట్రెడిషన్, సంప్రదాయాలు ప్రోత్సహించడం, భారతీయుల ఐక్యతను బలపరచడం వంటి అంశాల్లో గత 42 ఏళ్లుగా FIA పనిచేస్తోంది. 2022లో గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆయన తర్వాత మళ్లీ ఇప్పుడు విజయ్, రష్మిక ఆ గౌరవాన్ని పొందారు.
సినిమాల విషయానికొస్తే... విజయ్, రష్మిక తొలిసారిగా 'గీత గోవిందం' మూవీలో నటించి హిట్ పెయిర్‌గా పేరొందారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'లో కలిసి నటించారు. ప్రస్తుతం విజయ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తుండగా... ఇందులోనూ రష్మికే హీరోయిన్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం 'మైసా' మూవీలో నటిస్తున్నారు.