Coolie Day 4 Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ పవర్ 'కూలీ' థియేటర్లకు జనాలను రప్పిస్తోంది. మిక్స్డ్ టాక్, నెగిటివ్ రివ్యూలతో సంబంధం లేకుండా ఈ సినిమా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. తమిళ ప్రేక్షకులు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి కోలీవుడ్ సినిమాగా 'కూలీ' రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేశారు. ఆ ఆశ తీరే అవకాశం లేదు గానీ అలాగని మరీ తీసిపారేసే కలెక్షన్స్ కాకుండా కాస్త చెప్పుకోదగ్గ రీతిలో ఓపెనింగ్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ 'కూలీ'కి ఎన్ని కోట్లు వచ్చాయి? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు వస్తే హిట్ అవుతుంది? అనేది తెలుసుకోండి.

ఇండియాలో 200 కోట్ల రీచ్ అయిన 'కూలీ'!Coolie First Four Days India Collection: ఇండియన్ మార్కెట్టులో 'కూలీ' కలెక్షన్స్ బావున్నాయ్. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అందుకు 6 కోట్ల దగ్గర ఆగింది. ఇండియాలో 'కూలీ' ఫస్ట్ వీకెండ్ నెట్ కలెక్షన్స్ రూ. 193 కోట్లు.

ఇండియాలో ఫస్ట్ వీకెండ్ 'కూలీ' ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... ఓపెనింగ్ డే రూ. 65 కోట్లు వసూలు చేసి తమిళ్ సినిమా రికార్డ్స్ తిరగరాసింది. రెండో రోజు రూ. 54.75 కోట్లు, మూడో రోజు రూ. 39.5 కోట్లు, ఇక నాలుగో రోజైన ఆదివారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలో 'కూలీ' కేవలం రూ. 34 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ టోటల్ ఇండియన్ కలెక్షన్లు రూ. 193.25 కోట్ల నెట్ కలెక్షన్స్. గ్రాస్ చూస్తే 200 కోట్లు ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్.

వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు దాటలేదు గానీ!వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలు చూస్తే... రూ. 400 కోట్ల మార్కును 'కూలీ' అందుకోలేదు. కానీ మొదటి నాలుగు రోజుల్లో రూ. 380 కోట్లు కలెక్ట్ చేసింది. రజనీకాంత్ స్టార్ పవర్, ఇతర భాషల నుంచి పేరున్న హీరోలు నటించడం వల్ల ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా 'కూలీ' కలెక్షన్స్ రాబడితే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. లేదంటే కష్టం అవుతుంది.

Also Read: వార్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ సినిమాకు వచ్చింది ఎన్ని కోట్లు? ఇంకా ఎంత వస్తే హిట్టు?

మొదటి మూడు రోజుల్లో 'కూలీ' వరల్డ్ వైడ్ షేర్ రూ. 162 కోట్లు. క్లీన్ హిట్ అయ్యి సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే మరో రూ. 145 కోట్ల షేర్ రావాలి. ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ చూస్తుంటే అంత కలెక్షన్ వచ్చేలా కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేయగా... సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, రచితా రామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

Also Readవరంగల్‌ to 'బిగ్ బాస్' వయా సాఫ్ట్‌వేర్ జాబ్... ఎవరీ అనూష? అగ్నిపరీక్షలో వైరల్ అమ్మాయి, ఇన్‌స్టా సెలబ్రిటీ గురించి తెల్సా?