Vijay Deverakonda Rashmika Mandanna New Movie Started: సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ జోడీ సందడి చేయనుంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి ఓ మూవీ చేయనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఎలాంటి హడావిడి లేకుండా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో రీసెంట్‌గా ప్రారంభించారట మేకర్స్.


'టాక్సీవాలా' డైరెక్టర్‌తో


విజయ్ దేవరకొండతో 'ట్యాక్సీవాలా' మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... హీరోయిన్‌గా రష్మిక చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా మూవీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో విజయ్‌ను చూపించబోతున్నారట. 


1870ల నాటి బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే ఓ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీలో విజయ్ రాయలసీమకు చెందిన ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నారట. 'ద మమ్మీ' ఫేం ఆర్నాల్డ్ ఓస్లో మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Also Read: 'అఖండ 2' రిలీజ్ డేట్‌పై బాలయ్య లీక్స్ - ఫ్యాన్స్ ఫుల్ ఖుష్... అది కన్ఫర్మ్‌యేనా?


'గీత గోవిందం' మూవీతో విజయ్, రష్మిక హిట్ జోడీగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' మూవీ నిరాశపరిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తున్నారు.


ఇటీవల కాలంలో విజయ్‌ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన హై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్' మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు విజయ్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక పవర్ ఫుల్ వారియర్‌గా 'మైసా' మూవీలోనూ నటిస్తున్నారు. 'రాఘవ లారెన్స్' హిట్ హారర్ ఫ్రాంచైజీ 'కాంచన 4'లోనూ ఆమె దెయ్యం పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'థామా'లో కీ రోల్ ప్లే చేయగా ఈ దీపావళికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


సినిమాల విషయం పక్కన బెడితే ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఎంతోకాలంగా సాగుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో ఇద్దరూ హోటల్స్, వెకేషన్స్‌కు వెళ్లడం, దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లోనూ ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మరోసారి డేటింగ్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.