Vijay Devarakonda About His Marriage: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా సినిమా రిలీజ్‌కు వారం రోజులు మాత్రమే ఉండగా ప్రమోషన్స్‌లో వేగం పెంచాడు విజయ్. ఇప్పటికే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ ట్రైలర్ రెస్పాన్స్ తెలియడం కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. తాజాగా హైదరాబాద్, తిరుపతిలో ఈవెంట్ ముగిసిన తర్వాత ఏకంగా చెన్నైలో ప్రెస్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అక్కడ తన పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. అంతే కాకుండా తమిళంలో తన సినిమా ప్లాన్స్‌ను బయటపెట్టాడు.


తప్పకుండా లవ్ మ్యారేజ్..


‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నారు కదా.. 2024లో మీరు ఫ్యామిలీ స్టార్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అని విజయ్ దేవరకొండకు ప్రశ్నకు ఎదురయ్యింది. ‘‘2024లో అయితే కాదు. కానీ కచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటాను. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు కూడా పిల్లలు కావాలి. కానీ ఇప్పుడు కాదు’’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అన్న ప్రశ్నకు లవ్ మ్యారేజ్ అని సమాధానమిచ్చాడు విజయ్. ‘‘లవ్ మ్యారేజ్ అయినా కూడా అమ్మ, నాన్నకు ఆ అమ్మాయి నచ్చాలి. వారు కూడా ఇష్టపడాలి’’ అని చెప్పాడు. అయితే అమ్మాయి ఎవరు అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ సరదాగా సమాధానమిచ్చాడు విజయ్.


రష్మికతోనే చేద్దాం..


ఇక విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ అంటే రష్మిక మందనా పేరు లేకుండా ఉండదు. ఏదో ఒక విధంగా వారి రిలేషన్‌షిప్ గురించి తెలుసుకోవడానికే అందరూ ప్రయత్నిస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ‘‘తమిళంలో నేరుగా సినిమా చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ హీరోయిన్‌తో చేస్తారు’’ అని విజయ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తినే ‘‘మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు’’ అని రివర్స్‌లో ప్రశ్నించాడు విజయ్. దానికి ఆయన రష్మిక అని సమాధానిమిచ్చాడు. ఆ సమాధానానికి విజయ్ ఎక్కువగా ఆలోచించకుండా ‘‘రష్మికతోనే చేద్దాం’’ అని హామీ ఇచ్చాడు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో విజయ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొనగా.. రష్మిక పేరు మధ్యలోకి రాగానే ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు.


విజయ్ నిర్ణయం కాదు..


‘‘ఆ టైమ్‌లో డైరెక్టర్ డిమాండ్ ఏమయ్యింటుందో అదే ఫైనల్ అవుతుంది. నేను ఫ్యామిలీ స్టార్ చేస్తున్నప్పుడు ఒకవేళ విజయ్ ఏ హీరోయిన్ అయినా కావాలని చెప్పినా డైరెక్టర్, నేను కలిసి హీరోయిన్ ఎవరు అయితే బాగుంటుంది అని చర్చించుకుంటాం. అలా చర్చించుకున్నప్పుడు విజయ్‌తో ఎవరు చేస్తే పెయిర్ కొత్తగా కనిపిస్తుంది అని ఆలోచించాం. అప్పుడే మృణాల్‌ను ఫైనల్ చేశాం. విజయ్‌కు చెప్పాం. బాగుందన్నాడు. ఫైనల్ చేశాం’’ అని దిల్ రాజు వివరించారు. ఇక పరశురామ్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.


Also Read: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌