Vijay Antony's Vanda Devullu First Look Revealed : కోలీవుడ్ స్టార్, మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో వచ్చిన బిచ్చగాడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తల్లి ఆరోగ్యం బాగు పడాలని కోటీశ్వరుడైన కొడుకు బిచ్చగాడిగా దీక్ష చేసే స్టోరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 2016లో వచ్చిన ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. 

Continues below advertisement

సేమ్ కాంబో... వంద దేవుళ్లు

బిచ్చగాడులో 'వంద దేవుళ్లే కలిసొచ్చినా...' సాంగ్ హార్ట్ టచింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగే టైటిల్‌గా విజయ్ ఆంటోని, శశి కాంబోలో 'వంద దేవుళ్లు' మూవీ తెరకెక్కనుంది. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. డైనమిక్ స్టార్, యంగ్ హీరో విష్ణు మంచు ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 

Continues below advertisement

విజయ్ ఆంటోని మాసీ లుక్

చెరుకు తోటలో విజయ్ ఆంటోని మాసీ లుక్ అదిరిపోయింది. ఆయన రా అండ్ రస్టిక్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కత్తి పట్టుకున్న తీరు వెనకాల హీరోయిన్ స్వాసిక ఉన్న తీరు ఇంటెన్స్‌గా ఉంది. పల్లెలో మట్టి మనుషులుగా వీరు కనిపించనున్నట్లు లుక్‌ను బట్టి అర్థమవుతోంది. 'ప్రేమ గాఢమై, బంధాలు బలపడినప్పుడు ఓ కథ మొదలవుతుంది.' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. విజయ్ ఆంటోని, స్వాసికలతో పాటు అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Also Read : పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ బ్యూటీ - ప్రియుడితో పునర్నవి భూపాలం వివాహం... ఫోటోలు వైరల్

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు.

టెక్నికల్ టీం -  బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్, సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని, నిర్మాత :  రామంజనేయులు జవ్వాజి, దర్శకుడు : శశి, సంగీతం : బాలాజీ శ్రీరామ్, డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్, ఎడిటర్ : హరిష్ యువరాజ్, డైలాగ్స్ : భాష్య శ్రీ.