Ram Charan's Peddi Movie Teaser Release Date Locked : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ నుంచి రయ్ రయ్ సాంగ్ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. టీజర్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
టీజర్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేసినా... అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అదే రోజున టీజర్ రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 'కుస్తీ' పేరుతో రానున్న టీజర్‌తో చరణ్ మాస్ రోల్, స్టోరీపై ఓ క్లారిటీ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read : 'ప్రేయసి రావే'కి సీక్వెల్ రెడీ - పిఠాపురంలో అలా మొదలైంది ట్రైలర్ ఈవెంట్‌లో బిగ్ అప్డేట్
టైటిల్ గ్లింప్స్‌లో సిగ్నేచర్ షాట్ నుంచి చరణ్ మాస్ లుక్స్ మూవీపై హైప్ పదింతలు పెంచేశాయి. వీటితో పాటే చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ మాస్ ఎనర్జిటికల్ స్టెప్స్ లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ రాబోయే టీజర్ వీటన్నింటినీ మించి ఉండడం కన్ఫర్మ్ అంటున్నారు చరణ్ ఫ్యాన్స్.
సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌గా యాక్షన్ ఎలిమెంట్స్‌తో మూవీ రూపొందుతోంది. అనుకోని కారణాలతో వాయిదా పడిన మూవీ వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
RC17 అప్డేట్ కూడా...
ఇక ఇదే రోజున చరణ్ నెక్స్ట్ మూవీపైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌తో చరణ్ మూవీ చేయబోతుండగా... ఇప్పటికే స్టోరీ లాక్ అయ్యింది. పీరియాడిక్ లేదా గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్‌గా స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా... చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది.
టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అంటా కూమెంట్స్ వస్తున్నాయి.
