Vijay Antony about Relationships Between Couple: డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో.. విజయ్ ఆంటోని. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవీ అంతగా రానించలేదు. దీంతో ఇప్పుడు ఒక సరికొత్త కామెడీ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ‘లవ్ గురు’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. దాంట్లో భాగంగానే ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు విజయ్ ఆంటోని. పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన. దాంట్లోభాగంగా సినిమా విశేషాలు చెప్తూనే.. భార్యను ఎలా చూసుకోవాలి? ఆమెను అర్థం చేసుకుంటే కచ్చితంగా మన లైఫ్ కూడా బాగుంటుంది అంటూ తన ఎక్స్ పీరియెన్స్ పంచుకున్నారు విజయ్.
రెస్ట్రిక్ట్ చెయొద్దు.. ఫ్రీగా వదిలేయాలి..
"రిలేషన్ లో ఉన్నప్పుడు అవతలి వాళ్లు తప్పు చేసినా యాక్సెప్ట్ చేయాలా? వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి" అనే ప్రశ్నకి సమాధానం చెప్పారు విజయ్ ఆంటోని. "మనం ప్రతీది ఒక విధంగానే ఆలోచిస్తాం. ఇది చాలా క్రిటికల్, సైకలాజికల్ విషయం. ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. అదే ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్ అయినా, భార్య అయినా కంప్లీట్ గా మారిపోతాం. ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయం, రెస్ట్రిక్ట్ చేయం దీంతో.. ఇద్దరి మధ్య ఒక వండర్ ఫుల్ జర్నీ ఉంటుంది. అదే.. పెళ్లి అయిన తర్వాత ఆమె చేతులు కట్టేస్తాం. రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎప్పుడైతే.. మనం వాళ్లతో ఫ్రీగా ఉంటామో, వాళ్లను ఫ్రీగా ఉండనిస్తామో.. వాళ్లు కూడా మనతో ఫ్రీగా ఉంటారు. ఆమె అన్నీ మనతో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటారు. పెళ్లి తర్వాత చేతులు కట్టేస్తాము కాబట్టి వాళ్లు భయపడతారు. అందుకే, పెళ్లికి ముందు నార్మల్ గా జరిగిన డిస్కషన్స్ తర్వాత జరగవు. అందుకే, పెళ్లయ్యాక కూడా ఫ్రెండ్ షిప్ మెయింటెయిన్ చేయాలి. ఎమోషన్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించండి. అందరూ మ్యారేజ్ డే అంటే.. ఫ్రెండ్ షిప్ డేకి ఎండ్ అనుకుంటారు. కానీ, అలా ఉండొద్దు. ఆమెకు స్పేస్ ఇవ్వాలి. తను కూడా మనకి స్పేస్ ఇవ్వాలి. అన్ని విషయాలు డిస్కస్ చేసుకునేలా ఉండాలి. ఇద్దరు ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునేలా ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది" అని పెళ్లి గురించి చెప్పారు విజయ్ ఆంటోని.
‘లవ్ గురు’ డిఫరెంట్..
"సినిమా విషయానికొస్తే.. ఇద్దరు కంప్లీట్ గా డిఫరెంట్. అతను ఏది చేసినా ఆమె భరిస్తుంది. అమ్మాయిని సపోర్ట్ చేస్తే కచ్చితంగా మనల్ని లవ్ చేస్తుంది. అందుకే, కంట్రోల్ చేయకుండా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకసారి అమ్మాయిని సపోర్ట్ చేస్తే.. కచ్చితంగా మనతోనే ఉంటారు. పెళ్లి అనే విషయంతో అమ్మాయిని కట్టేయొద్దు. ఫ్రీగా వదిలేస్తే కచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది. జడ్జ్ చేయొద్దు. ఈ సినిమాలో ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తాడు. ఇక ఆ అమ్మాయి కూడా అవ్వన్నీ చూస్తూ.. అంటూ చెప్పడం విజయ్ ఆంటోని. స్టోరి ఇక్కడే చెప్పేసేలా ఉన్నాను అని అన్నారు.
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రోమియో'. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవ్ గురు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విజయ్ ఆంటోనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. మరి థియేటర్లలో ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.
Also Read: బాలయ్య - బాబీ మూవీకి ఊరమాస్ టైటిల్? ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!