Vicky Kaushal Reaction On Katrina Kaifs Towel Fight Scene: ‘టైగర్ 3’ ట్రైలర్ విడుదల తర్వాత కత్రినా కైఫ్ యాక్షన్ సీన్లు సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా కత్రినా టవల్ సీన్ అద్భుతం అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ యాక్షన్ సీన్ పై ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ఈ 'టవల్ ఫైట్ సీన్'పై కత్రినా భర్త విక్కీ కౌశల్ దించారు. ఈ సీన్ కోసం ఆమె పడిన కష్టానికి గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. ఈ సీన్  తన భార్యతో కలిసి థియేటర్లలో చూసినప్పుడు చెప్పిన మాటలను ఆయన మరోసారి గుర్తు చేశారు. 


‘టవల్ ఫైట్‘ చూసి నా భార్యతో ఏం చెప్పానంటే?- విక్కీ కౌశల్


విక్కీ కౌశల్ తాజా చిత్రం 'సామ్ బహదూర్'. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ 'టైగర్ 3'లో టవల్ ఫైట్ గురించి స్పందించారు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడినట్లు చెప్పారు. “నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి చూశాను. చాలా యాక్షన్ సీన్లు చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి “ఇక నుంచి నేను నీతో వాదించకూడదు అనుకుంటున్నాను. నువ్వు టవల్ వేసుకుని నన్ను కొట్టడం అస్సలు ఇష్టం ఉండదు” అని చెప్పినట్లు వెల్లడించారు. బాలీవుడ్‌లో కత్రినా అత్యంత అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. అంతేకాదు, యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న కష్టానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆమె నిజంగా చాలా స్ఫూర్తిదాయకం” అని వెల్లడించారు.


తన మామ ప్రశంసలపై కత్రినా సంతోషం


విక్కీ కౌశల్ మాత్రమే కాదు, అతడి తండ్రి షామ్ కౌశల్ కూడా ‘టైగర్ 3’ యాక్షన్ సన్నివేశాలలో తన కోడలు నటనపై ప్రశంసలు కురిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో కత్రినా అద్భుతంగా నటించిందని చెప్పారు. ఇదే విషయాన్ని కత్రినా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అయిన మా మామ నా యాక్షన్ సీన్స్ గురించి ప్రశంసలు కురిపించడం నిజంగా గొప్పవిషయం అని చెప్పింది. “షామ్ జీ మా మామగారు. చాలా సీనియర్ యాక్షన్ డైరెక్టర్. ఆయన నుంచి నా యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రశంసలు నాకు చాలా ప్రత్యేకం” అని చెప్పుకొచ్చారు. 


‘టైగర్ 3’లో కత్రినా కైఫ్ జోయా అనే ISI ఏజెంట్ పాత్రను పోషించింది.  మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ హీరోగా నటించగా ఇమ్రాన్ హష్మీ, రేవతి, సిమ్రాన్, రిద్ధి డోగ్రా కీలక పాత్రల్లో నటించారు. షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.


Read Also: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply