సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించగా.. ఇవాళ సీనియర్ తమిళ నటుడు నాజర్ కు పితృ వియోగం కలిగింది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 


ఇప్పుడు మెహబూబ్ బాషా వయస్సు 95 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతుండగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వయో భారంతో నేడు తమిళనాడులోని చెంగల్పట్టులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.


నాజర్ మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేసారు. మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాజర్ మరణ వార్త తెలుసుకొని సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పితృ వియోగంతో బాధపడుతున్న నాజర్ కు బంధుమిత్రులు సానుభూతి తెలుపుతున్నారు. 


దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం రాత్రి మరణించగా, మంగళవారం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలోనే నాజర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇలా రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఇండస్ట్రీ ప్రముఖుల ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


నాసర్ తండ్రి మెహబూబ్ బాషా కాగా, తల్లి పేరు ముంతాజ్. నాజర్ అసలు పేరు మహమ్మద్ హనీఫ్. 80స్ లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాజర్.. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు తమిళ చిత్రాలతో పాటుగా మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆయన తమిళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నడిగర్ సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.


Also Read: 'ఇండియన్-2' అప్డేట్​ ఇచ్చిన శంకర్.. మరి 'గేమ్ చేంజర్' సంగతేంటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial