Saindhav OTT Streaming: ఈ సంక్రాంతికి థియేటర్లోకి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విక్టరి వెంకటేష్ సైంధవ్ మూవీ ఒకటి. వెంకటేష్ 75వ మూవీగా వచ్చిన ఈ సినిమాను హిట్ ఫేం శైలేష్ కోలను దర్శకత్వం వహించారు. ఈసినిమాలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. అంచనలా మధ్య రిలీజైన సైంధవ్ మూవీ ఊహించని రితీలో ఫెయిల్ అయ్యింది. థియేటర్లోకి వచ్చి అలా వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు సైంధవ్ అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని టాక్. సైంధవ్ వెంకటేష్ మైల్‌స్టోన్ మూవీ కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దానికి తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందు మూవీని వెంకీమామ బాగా ప్రమోట్ చేశాడు. దీంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య విడులైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పూర్ టాక్ తెచ్చుకుంది. అదే టైంలో రిలీజైన 'హనుమాన్' మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. మరోవైపు ఒకరోజు తేడాతో వచ్చిన నాగార్జున 'నా సామిరంగ' హిట్ కూడా 'సైంధవ్'కు మైనస్ అయ్యిందంటున్నారు. మొత్తానికి సైంధవ్‌కు ఆశించిన సక్సెస్ రాకపోవడంతో వెంకి ఫ్యాన్స్ నిరాశే మిగిలింది. దీంతో నెల రోజుల ముందే మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Also Read: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన విజయేంద్ర ప్రసాద్ - ‘ఆర్ఆర్ఆర్’పై అలాంటి వ్యాఖ్యలు
ఇప్పటికే సైంధవ్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 15కోట్లకు సైంధవ్‌ను కోనుగోలు చేసిందని తెలుస్తోంది. అనుకున్నట్టు సైంధవ్ హిట్ అయితే ఫిబ్రవరి నెలాఖారు లేదా, మార్చిలో ఓటీటీలోకి రిలీజ్ చేయాలని అమెజాన్ ప్లాన్ చేసింది. కానీ మూవీకి ప్లాప్ టాక్ రావడంతో నెల రోజుల ముందుగానే డిజిటల్ స్ట్రీమ్ చేయాలని సదరు సంస్థ అనుకుంటుందట. అంటే ఫిబ్రవరి 2న లేదా 9వ తేదీన మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'సైంధవ్' కథ ఏంటంటే..
ఈ సినిమాలో వెంకటేష్ సైకో సైంధవ్ పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ కథ, నెరేషన్ రోటిన్‌గా ఉందని ఆడియన్స్ నుంచి అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పటి ట్రెండ్ తగ్గట్టుగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకున్నాడు శైలేష్ కోలను. కానీ వాటితో ఆడియన్స్‌ను మెప్పించడంతో ఫెయిల్ అయ్యాడు. కథ ఎక్కువగా ల్యాగ్ ఉండటం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా చూపించకపోవడమే మూవీ ఫెయిల్‌కి కారణమంటున్నారు. విక్రమ్..జైలర్ తరహాలో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో 'సైంధవ్' ఫెయిల్ అయ్యిందంటున్నారు. సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రస్థలో పోర్ట్ ఉద్యోగి.
అతడి పాప గాయత్రి (సాపాలేకర్) అంటే అతనికి ప్రాణం. మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) క్యాబ్ డ్రైవర్. సైంధవ్ పక్కింట్లో ఉంటుంది. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతడి మీద కేసు పెట్టి ఇంటికి వచ్చేస్తుంది. సైంధవ్ అంటే మనోజ్ఞరా కు ప్రాణం. అతని బిడ్డను తన కన్నకుతురిలా చూసుకుంటుంది. ఒక రోజు గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని, బతకాలంటే రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. తన కూతురి బతికించుకోవడం సైంధవ్ ఏం చేశాడు.. డబ్బు వేటలో సైంధవ్ ఎదుర్కొన్న పరిణామాల చూట్టూ ఈ మూవీ సాగుతుంది.