'రానా నాయుడు' వెబ్ సిరీస్ ద్వారా ఈ మధ్య ఓటీటీ వీక్షకులకు ముందుకు విక్టరీ వెంకటేష్ (Venkatesh) వచ్చారు. అందులో కొత్తగా కనిపించారు. ఫ్యామిలీ ఇమేజ్ పక్కన పెట్టి కొత్త క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన సినిమా మీద కాన్సంట్రేట్ చేశారు. కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


ఉగాది తర్వాత రోజు నుంచి...
వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఆ విషయాన్ని వెల్లడించారు. 


'సైంధవ్'లో రుహానీ శర్మ
'సైంధవ్' మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. వెంకటేష్ 75వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన రగ్గడ్ లుక్, ఇంటెన్సిటీ బావున్నాయి. ఈ సినిమాలో రుహానీ శర్మ (Ruhani Sharma)కు కీలక పాత్ర దక్కింది. శైలేష్ కొలను తెరకెక్కించిన తొలి సినిమా 'హిట్ : ది ఫస్ట్ కేస్'లో ఆమె నటించారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. రుహానీకి మరోసారి శైలేష్ అవకాశం ఇచ్చారు. ఈ 'సైంధవ్'లో ఆమెది కథానాయిక పాత్ర కాదని తెలిసింది. గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర అట!


ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Navajun Siddiqui) కీలక పాత్ర చేస్తున్నారు.ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.


Also Read : 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?


హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన వెంకీ!
గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.


వెంకటేష్‌కు శైలేష్‌తో చేస్తున్న సినిమానే చివరి మైల్‌స్టోన్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరిలో మెల్లగా సినిమాలు చేస్తూ వెళ్తుంది వెంకీనే. ఈ స్పీడ్‌లో మరో 25 సినిమాలు పూర్తి చేయడం అంటే దాదాపు ఇంపాజిబుల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమాను మెమరబుల్‌గా మార్చుకోవడానికి వెంకటేష్ చాలా కష్టపడతారు.  


నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి 'సైంధవ్'ను నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.


Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా