Venkatesh'S Daggubati Movie Holly Wood Remake: టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ఒకటి ఇప్పుడు హాలీవుడ్‌ రేంజ్‌కి వెళ్తోంది. ఈ సినిమాని హాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎన్నో భాషల్లో రీమేక్‌ చేసిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ సినిమానే 'దృశ్యం'. వెంకటేశ్‌, మీనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ఈసినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు హాలీవుడ్‌ రేంజ్‌కి ఎదిగింది.  


ఇప్పటికే కొరియా, ఇండోనేషియాలో..


మళయాల సీనియర్‌ నటుడు మోమన్‌లాల్‌, అన్సిబా హస్సన్‌, మీనా తదితరులు నటించిన సినిమా దృశ్యం. 2013లో మళయాలంలో రిలీజైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. దీంతో ఆ సినిమాని మరెన్నో భాషల్లో రీమేక్‌ చేశారు. తెలుగులో వెంకటేశ్‌, హిందీలో కమల్‌హాసన్‌, అజయ్‌దేవగణ్‌, కన్నడలో, తమిళ్‌లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత సిన్హల భాషలో, చైనీస్‌లో కూడా దృశ్యం సినిమాని రీమేక్‌ చేశారు. ఇప్పటికే కొరియన్‌, ఇండోనేషియాలో ఈ సినిమాకి సంబంధించి పనులు జరుగుతుండగా.. హాలీవుడ్‌లో రీమేక్‌ కోసం సినిమా రైట్స్‌ కొన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌ (X)లో పోస్ట్‌ చేసింది. 


"ఇండియాలో, చైనాలో అద్భుతమైన విజయం సాధించిన 'దృశ్యం'.. మరోసారి గొప్ప సక్సెస్‌ని అందుకోబోతోంది. ఈ సినిమా ప్రొడ్యూసర్లు కుమార్‌ మంగత్‌ పాటక్‌, అభిషేక్‌ పాటక్‌లు ఇప్పటికే కొరియన్‌ ఫ్రాంచైజ్‌ గురించి ప్రకటించారు. ఇక ఇప్పుడు పనోరమా స్టూడియోస్‌తో చేతులు కలపనున్నారు. గల్ఫ్‌ స్ట్రీమింగ్‌ పిచ్చర్స్‌, జోట్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని హాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు. ఇది మొదటి భారతీయ చిత్రం " అని ట్రేడ్‌ ఎనలిస్ట్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. ఇదే విషయాన్ని శ్రీధర్‌ పిల్లాయ్‌ కూడా ట్వీట్‌ చేశారు.






మోహన్‌లాల్‌ నటించిన 'దృశ్యం' సినిమా 2013లో రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాని జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. దృశ్యం సినిమాలో మళయాంలో భారీ హిట్‌గా నిలిచింది. దీంతో 2014లో దీన్ని కన్నడలో రీమేక్‌ చేశారు. ఆతర్వాత తెలుగులో రవిచంద్రన్‌, వెంకటేశ్‌ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కించారు. 2015లో తమిళ్‌లో పాపనాసం అనే పేరుతో ఈ సినిమాని తీశారు. ఇక హిందీలో 'ద్రిశ్యం' పేరుతో ఈ సినిమాని తెరకెక్కించగా.. దాంట్లో అజయ్‌ దేవగన్‌, కమల్‌హాసన్‌ లీడ్‌రోల్స్‌ చేశారు. 2017లో సింహలలో 'ధర్మయుద్ధయా' పేరుతో 'షీప్‌ విట్‌ఔట్‌ ఏ షపర్డ్‌' పేరుతో మాండరీన్‌ భాషలో రిలీజ్‌ చేశారు. అయితే, ఈ సినిమాని వివిధ భాషల్లో వేరువేరు దర్శకులు తెరకెక్కించారు. తమిళంలో మాత్రం జీతూ జోసెఫ్‌ తీశారు. ఇక ఇండోనేషియా, కొరియన్‌లో సినిమాకి సంబంధించి పనులు సాగుతున్నాయి.


సీక్వెల్‌..


ఇన్ని భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్‌ చేశారు మేకర్స్‌. 'దృశ్యం - 2' పేరుతో దాన్ని తెరకెక్కించారు. ‘దృశ్యం’ సినిమాకు కొనసాగింపుగా ఈ సీక్వెల్‌ తీశారు. 2021లో ఈ సినిమాని తెరకెక్కించగా.. సెకండ్‌ పార్ట్‌ని తెలుగు, కన్నడ, హిందీలో మాత్రమే రీమేక్‌ చేశారు. ఇక సెకెండ్‌ పార్ట్‌ కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. 


Also Read: ఎంత చెప్పినా వినలేదు, బిగ్‌బాస్‌కి వెళ్లివచ్చాక బ్యాన్‌ చేశారు