Venkatesh, Anil Ravipudi Reunite for Laughter : టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఒక్క ఫ్లాప్ లేని సక్సెస్ఫుల్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. కమర్షియల్ అంశాలకు కామెడీని జోడించి తనదైన ఫిల్మ్ మేకింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 'పటాస్' నుంచి రీసెంట్ గా వచ్చిన 'భగవంత్ కేసరి' వరకు వరుస సక్సెస్ లు అందుకుని సినిమా సినిమాకి తన బ్రాండ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.


'భగవంత్ కేసరి'తో మరో హ్యాట్రిక్


నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' గత ఏడాది దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీలీల మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ సక్సెస్‌ను అందించింది. గత సినిమాలకు విభిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించారు అనిల్ రావిపూడి. కమర్షియల్ అంశాలతో పాటు ఓ సోషల్ మెసేజ్ ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆడపిల్లలు ప్రపంచం ఎదుట ధైర్యంగా నిలబడాలనే కాన్సెప్ట్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు కమర్షియల్ డైరెక్టర్ గా పేరొందిన అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి'తో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు.


వెంకటేష్ తో ముచ్చటగా మూడోసారి..


'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నారట. రీసెంట్ గానే వెంకీ మామకు అనిల్ రావిపూడి ఓ స్క్రిప్ట్ ని నెరేట్ చేయగా.. స్టోరీ లైన్ నచ్చడంతో వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.


ప్రజెంట్ ఇదే స్క్రిప్ట్ మీద అనిల్ రావిపూడి వర్క్ చేస్తున్నారట. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ తో వెంకటేష్ ని కలవనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ నెరేషన్ అయిపోయాక ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వెంకటేష్‌‌తో అనిల్ రావిపూడి 'ఎఫ్2', 'ఎఫ్3' వంటి సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు సమాచారం.


దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి - వెంకటేష్ ప్రాజెక్ట్


వెంకటేష్‌తో అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించినట్లు సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడితో దిల్ రాజు 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్3' వంటి వరుస సినిమాల చేశారు. ఇప్పుడు వీరిద్దరూ డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా 'ఎఫ్2', 'ఎఫ్3' తరహా లోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు.



Also Read: నాకు ఎవరూ సపోర్ట్‌గా వచ్చి మాట్లాడేవారు కాదు - డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్‌ కామెంట్స్‌