Venkatesh's Nuvvu Naku Nachchav Re Release: విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కామెడీ ఎంటర్‌టైనర్ 'నువ్వు నాకు నచ్చావ్'. వెంకీ, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ఈ హిట్ బొమ్మను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Continues below advertisement

రీ రిలీజ్ ఎప్పుడంటే?

వచ్చే ఏడాది నూతన సందర్భంగా 2026, జనవరి 1న మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో రిలీజ్ కాని ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో మూవీ రీ రిలీజ్ కానుంది. 2001లో సంక్రాంతి స్పెషల్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించగా... స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి స్టోరీ అందించారు.

Continues below advertisement

ఈ మూవీలో వెంకీ, ఆర్తి అగర్వాల్‌తో పాటు ఫ్లోరా షైనీ, ప్రకాష్ రాజ్, సుధ, చంద్రమోహన్, సుహాసిని, బ్రహ్మానందం, సుదీప, సునీల్, ఎంఎస్ నారాయణ, హేమ, బాబు మోహన్, మల్లికార్జునరావు, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ వెంకీ కామెడీ డైలాగ్స్, పంచులు వేరే లెవల్. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, లవ్, కామెడీ ట్రాక్ ఇలా అన్నీ కలగలిపి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

Also Read: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారా - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్

స్టోరీ ఏంటంటే?

హైదరాబాద్‌‌లో ఫేమస్ బిజినెస్ మ్యాన్ మూర్తి (ప్రకాష్ రాజ్). అతని చిన్న నాటి ప్రాణ స్నేహితుడు శేఖరం (చంద్రమోహన్) కొడుకు వెంకీ (వెంకటేష్) మూర్తి కుమార్తె నిశ్చితార్థం కోసం అనకాపల్లి నుంచి హైదరాబాద్ వస్తాడు. అమెరికా కుర్రాడితో నందు (ఆర్తి అగర్వాల్) ఎంగ్జేజ్మెంట్ వైభవంగా జరుగుతుంది. ఇక వెంకీ, నందుల పరిచయమే గొడవలతో మొదలవుతుంది. ఆ తర్వాత వెంకీ మంచితనం చూసిన నందు అతన్ని ఇష్టపడుతుంది. దీంతో అసలు కథలో ట్విస్ట్ నెలకొంటుంది. నందుతో వెంకీ పెళ్లి జరుగుతుందా? అమెరికా పెళ్లి కొడుకు ఏమయ్యాడు? శేఖరం వెంకీకి పెట్టిన కండీషన్ ఏంటి? నందు ప్రేమను వెంకీ ఎందుకు యాక్సెప్ట్ చేయడు? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.