Pradeep Ranganathan's Dude Trailer Out: డైరెక్టర్‌గా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్నారు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'డ్యూడ్'. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ ఆకట్టుకుంటుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ అదుర్స్
'లైఫ్‌లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తే లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తుంది.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... సరదాగా అల్లరిగా తిరిగే ఓ యువకుడు అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించే ఓ యువతి మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. లవ్, ఎమోషన్‌తో పాటే కామెడీ యాంగిల్ కూడా ట్రైలర్‌లో చూపించారు. 'మన మధ్య ఈ లవ్ సెట్ కాదు' అనే హీరోయిన్ డైలాగ్‌తో బిగ్ ట్విస్ట్ నెలకొనగా... 'ఏంట్రా నీ కథ. పిల్లుంటే పెళ్లవదు. పెళ్లి ఉంటే పిల్ల ఉండదు. ఏంట్రా ఇది?' అంటూ ఫ్రెండ్ అనడం హైప్ క్రియేట్ చేస్తోంది.
'పక్కోడి ఫీలింగ్స్‌ను క్రింజ్‌గా చూడడమే కదా ఇప్పటి ట్రెండ్' అనే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. 'ఈ బాడీ వేసుకుని గొడవలకు వెళ్తున్నావే. ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా?' అన్న ప్రశ్నకు 'వంద మంది వచ్చినా కొట్టించుకోగలుగుతాను.' అంటూ కామెడీ యాంగిల్ సైతం చూపించారు. మొత్తానికి ఓ ఫుల్ లెంగ్త్ లవ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
Also Read: అందమైన గోదావరి... విలేజ్‌లో క్యూట్ లవ్ స్టోరీ 'ఆనందలహరి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీతోనే కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా... ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే రోహిణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా... తెలుగుతో పాటు తమిళంలోనూ దీపావళి సందర్భంగా ఈ నెల 17న మూవీ రిలీజ్ కానుంది.