వెంకట్... ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, ఓ తరం ముందుకు వెళితే మంచి సినిమాలు చేసిన నటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి 'శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి', మెగాస్టార్ చిరంజీవితో 'అన్నయ్య', జగపతి బాబుతో 'శివ రామరాజు', ఇంకా 'ప్రేమ కోసం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన సోలో హీరోగా ఓ సినిమా చేశారు. అదే 'హరుడు'. ఆ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

Continues below advertisement

మే 8న థియేటర్లలోకి 'హరుడు'Harudu Movie Release Date: సోలో హీరోగా వెంకట్ కమ్ బ్యాక్ సినిమా 'హరుడు'. వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. దీనికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ దిక్కల లక్ష్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సహ నిర్మాతలు. వేసవి సందర్భంగా మే 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. 

Also Read: Ram Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?

Continues below advertisement

''మా 'హరుడు' సినిమా కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ, కథనాలతో సినిమా తీశాం. వెంకట్ గారికి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది'' అని నిర్మాతలు చెప్పారు. 

Photo GalleryRamya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?

వెంకట్ హీరోగా రూపొందుతున్న 'హరుడు' సినిమాలో హెబ్బా పటేల్, సలోని, నాటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమ్మెట గాంధీ, 'దిల్' రమేష్, దొరబాబు కీలక తారాగణం. ఈ చిత్రానికి కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రాజ్ తాళ్లూరి, నిర్మాణ సంస్థ: వీఆర్ ఎంటర్టైన్మెంట్స్, సంగీతం (పాటలు): మని జీన్న, నేపథ్య సంగీతం: జీసీ క్రిష్, ఛాయాగ్రహణం: ఆనంద్.

Also ReadDhurandhar 2 BO Day 12: కేజీఎఫ్ 2 రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో 12 రోజుల నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?