Ram Charan Sukumar Movie RC17 Music Director: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో 'రంగస్థలం' ఓ స్పెషల్ సినిమా. రెండో సినిమా 'మగధీర'తో ఆయన భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కమర్షియల్ సక్సెస్‌లు సైతం ఆయన ఖాతాలో ఉన్నాయి. ఓ నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా 'రంగస్థలం' నిలిచింది. ఆ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 

దేవి శ్రీని పక్కన పెట్టిన సుకుమార్?సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపల్సరీ. దర్శకుడిగా పరిచయమైన 'ఆర్య' నుంచి 'పుష్ప 2: ది రూల్' వరకు తన ప్రతి సినిమాకూ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)తో తప్ప మరొకరితో పని చేయలేదు సుకుమార్. కానీ, ఇప్పుడు వేరే సంగీత దర్శకుడి వైపు ఆయన చూపు పడిందని టాక్. 

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా రామ్ చరణ్ 17వ సినిమా అది. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది' పూర్తి అయ్యాక సెట్స్ మీదకు వెళుతుంది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ (Sai Abhyankar)ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. RC17 Movieకి దేవిశ్రీ బదులు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ చేసే ఛాన్సులు ఎక్కువ అని టాక్. 

Also Read: Dhurandhar 2 BO Day 12: కేజీఎఫ్ 2 రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో 12 రోజుల నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు తమిళంలో నాలుగైదు భారీ సినిమాలు చేస్తున్నారు సాయి అభ్యంకర్. ఆ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించనున్న సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ సినిమా 'బెంజ్', ధనుష్ 55వ సినిమా, శింబు - వెట్రిమారన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఓకే అయితే ఆయన లైనప్ మరింత క్రేజీగా మారుతుంది. 

Also ReadPeddi Release Date : మరోసారి పెద్ది వాయిదా - కామెంట్స్‌పై నిర్మాత SKN క్లారిటీ... టీం రెస్పాండ్ అవుతుందా?

'పుష్ప 2' రీ రికార్డింగ్ విషయంలో సమస్యలు తలెత్తాయి. ఆ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నానని తమన్ అనౌన్స్ చేశారు. కానీ, చివరకు ఆయన నేపథ్య సంగీతం తీసుకోలేదు. తమిళ సంగీత దర్శకుడు శామ్ సిఎస్ అయితే 90 శాతం ఆర్ఆర్ తాను చేశానని చెప్పారు. ఇప్పుడు సుకుమార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించడం అంటే తెరవెనుక ఏదో జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Photo GalleryRamya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?