Vijay Deverakonda and Gautham Tinnanuri movie title: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి మేకర్స్ క్రేజీ ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ సర్కిల్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో పాటు విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మేకర్స్ స్పెషల్ వీడియోతో టైటిల్ అనౌన్స్మెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.


VD12 టైటిల్ ఇదేనా? 
విజయ్ దేవరకొండ - డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ని ఖరారు చేయని చిత్ర బృందం ఈ మూవీని VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదొక పీరియాడికల్  డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీకి యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇండియన్ స్క్రీన్ పైన ఎవర్ బిఫోర్ అనిపించే విధంగా ఈ మూవీ ఉంటుందని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశారు. 


అయితే VD12 మూవీని అనౌన్స్ చేసే చాలా రోజులై అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా దీనికి సంబంధించిన టైటిల్ లేదా టీజర్ ని రిలీజ్ చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం VD12 టైటిల్ ని అతి త్వరలోనే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. అంతలోనే ఈ మూవీ టైటిల్ విషయంలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం ఈ మూవీకి 'సామ్రాజ్యం', 'ది ఎంపైర్', 'కింగ్డమ్' అనే టైటిల్స్ ని మేకర్స్ అనుకుంటున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరి ఇందులో VD 12 మేకర్స్ మూవీకి ఏ టైటిల్ ను ఖరారు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది.


Also Readఉపేంద్ర 'యూఐ' నుంచి సుదీప్ 'మ్యాక్స్' వరకూ... ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న కన్నడ సినిమాల లిస్ట్‌ ఇదిగో


టైటిల్ అనౌన్స్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ 
VD12 చిత్ర నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసామని అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎక్స్ లో "ఈ మూవీ టైటిల్ విషయంలో కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అభిమానుల అబ్యూజ్, నేను డైరెక్టర్ గౌతమ్ ను పెట్టిన హింసతో మొత్తానికి ఓ టైటిల్ ని లాక్ చేసాము. అతి త్వరలోనే దాన్ని రివీల్ చేస్తాము" అంటూ ట్విట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అలర్ట్ అయ్యారు. ఇక తాజా సమాచారం ప్రకారం మూవీ టైటిల్ టీజర్ ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. అంతేకాదు ఈ మూవీలో విజయ్ దేవరకొండ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలఓ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవరకొండ కూడా ఆయన బాటలోనే గ్యాంగ్ స్టర్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. కాకపోతే పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్, దేవరకొన మాత్రం గ్యాంగ్ స్టర్ అంతే.   


Also Readరాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా...