'పెదరాయుడు', 'నరసింహ' సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన చిన్నారి 'మాస్టర్' మహేంద్రన్ (Master Mahendran). ఇప్పుడు అతడు పెద్దోడు అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'మాస్టర్' మహేంద్రన్ హీరోగా ఓ మైథలాజికల్ సినిమా రూపొందుతోంది. ఆ మూవీ అప్డేట్ ఏమిటంటే?
గుడి, నిధి నేపథ్యంలో 'వసుదేవ సుతం'
మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'వసుదేవ సుతం'. ఈ చిత్రాన్ని 'బేబీ' చైత్ర శ్రీ, 'మాస్టర్' యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్ బో సినిమాస్ పతాకం మీద ధనలక్ష్మి బాదర్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓ గుడి, అందులోని నిధి నేపథ్యంలో కథతో రూపొందుతున్న చిత్రమిది.
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?
'వసుదేవ సుతం' సినిమా గ్లింప్స్‌ను మణిశర్మ చేతుల మీదగా విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే... విశ్వం లోనుంచి భూమి, భూమి మీదున్న ఓ గుడి, ఆ గుడిలో ఉన్న నాగదేవత, ఆ తర్వాత హీరో పరిచయం - ఒకదాని వెంట మరొకటి చూపించారు. గ్లింప్స్ అయితే అదిరింది. గుడిలోని నిధి చుట్టూ తిరిగే కథతో సినిమా రూపొందుతోందని అర్థం అయ్యింది. దానిని మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఒరియా భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న 'వసుదేవ సుతం'లో అంబికా వాణి, జాన్ విజయ్, 'మైమ్' గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), సాహిత్యం: చైతన్య ప్రసాద్ - శ్రీ హర్ష ఈమని, యాక్షన్: 'బింబిసార' రామకృష్ణ, సంగీతం: మణిశర్మ, నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల, రచయిత - దర్శకుడు: వైకుంఠ్ బోను.