సంక్రాంతి 2026 మెగా ఫ్యామిలీకి, అభిమానులకు మెమరబుల్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల ఓ నిర్మాతగా రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' భారీ విజయం సాధించింది. సంక్రాంతి 2027 కూడా మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే...
సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్ - నిహారిక సినిమా!Varun Tej Niharika Konidela Movie Release Update: సుస్మితా కొణిదెల కంటే ముందు మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మాతగా మారారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి... తొలుత యూట్యూబ్ సిరీస్‌లు, ఆ తర్వాత ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌లు నిర్మించారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో నిర్మాతగా వెండితెరపై అడుగు పెట్టారు. తొలి అడుగులో విజయం సాధించారు. ఆ సినిమా దర్శకుడు యదు వంశీతో మరో సినిమా నిర్మిస్తున్నారు.
'కమిటీ కుర్రోళ్ళు' విజయం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో. చెల్లెలి నిర్మాణ సంస్థలో అన్నయ్య కథానాయకుడిగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోందని తెలిసింది.
Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పూజ కార్యక్రమాలు!మార్చి 28... అంటే శనివారం నాడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిసింది. శ్రీరామ నవమికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్ విడుదలైంది. అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చింది. శ్రీరామ నవమి తర్వాత రోజు పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి మరికొందరు కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేయనున్నారు.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
