తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిమేల్ డైరెక్టర్స్ తక్కువ. నందిని రెడ్డి వరుస సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య లక్ష్మీ సౌజన్య రెండు సినిమాలు చేశారు. ఇప్పుడీ ఫిమేల్ డైరెక్టర్స్ లిస్టులో ఓ హీరోయిన్ చేరుతున్నారు. అదీ వరుణ్ సందేశ్ సినిమాతో. ఆ వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

షగ్న శ్రీ దర్శకత్వంలో వరుణ్ సందేశ్!'నయనం' వెబ్ సిరీస్ ద్వారా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. 'జీ 5' ఓటీటీలో విడుదలైన సిరీస్‌తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు హీరో షగ్న శ్రీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా గుర్తుందా? అందులో కథానాయికగా నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు షగ్న శ్రీ. ఇప్పుడు ఆ అమ్మాయి మెగాఫోన్ పడుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఓ వైపు దర్శకత్వం వహిస్తూ మరో వైపు ఆ చిత్రంలో కథానాయికగానూ నటిస్తోంది.

Continues below advertisement

Also Readశివాజీ తప్పేముంది? యంగ్ హీరో రక్షిత్ అట్లూరి సపోర్ట్

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ 2ఎస్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. శ్సాస్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి. ఇదొక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని షగ్న శ్రీ తెలిపారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో టైటిల్ అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: దర్శిత్, నృత్య దర్శకత్వం: శ్రావణ్ ముప్పిరి, ఛాయాగ్రహణం: బ్రహ్మ తేజ మరిపుడి, సంగీతం: వంశీకాంత్ రేఖన, కూర్పు: ఛోటా కె ప్రసాద్, నిర్మాతలు: వీఎస్ కే సంజీవ్ - వంగలపల్లి సందీప్ - వంగలపల్లి సంకీర్త్, దర్శకత్వం: షగ్న శ్రీ వేణున్.

Also ReadPatang Movie Review - 'పతంగ్' రివ్యూ: ఒకేసారి ఇద్దరు అబ్బాయిలు... అదీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను ఓ అమ్మాయి ప్రేమిస్తే? వాళ్ళకు కాంపిటీషన్ పెడితే?