అమరావతి పేరు చెబితే ఏపీ రాజధాని గుర్తుకు వస్తుంది. అంతకు ముందు ఈ టైటిల్‌తో రవిబాబు ఓ సినిమా తీశారు. అయితే... ఇప్పుడు 'అమరావతికి ఆహ్వానం' (Amaravathiki Aahwanam Telugu Movie) పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.
వీఎఫ్ఎక్స్ పనుల్లో సినిమా!'అమరావతికి ఆహ్వానం'లో శివ కంఠంనేని హీరో. ఇందులో ధన్యా బాలకృష్ణ, ఎస్తర్, ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యం, జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని హీరో శివ కంఠంనేని తెలిపారు.
Also Read: శివాజీ తప్పేముంది? యంగ్ హీరో రక్షిత్ అట్లూరి సపోర్ట్
సినిమా గురించి హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ... ''హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి విజయాలు వస్తున్నాయి. మా సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది. ధన్య, ఎస్తర్, సుప్రిత వంటి నటీమణులతో అశోక్ కుమార్, జెమిని సురేష్, భద్రమ్ లాంటి సీనియర్ యాక్టర్లు కీలక పాత్రలు చేశారు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉండే మంచి కథతో సినిమా తెరకెక్కింది. థియేటర్స్‌లో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతి ఇస్తుంది'' అని అన్నారు. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ అని దర్శకుడు జివికె తెలిపారు.
Amaravathiki Aahwanam Movie Cast And Crew: శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అమరావతికి ఆహ్వానం' చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: జివికె, ఛాయాగ్రహణం: జె ప్రభాకర్ రెడ్డి, సంగీతం: పద్మనాబ్ భరద్వాజ్, కూర్పు: సాయిబాబు తలారి.