Varalaxmi Sarathkumar About criticism around fiance's looks: వరలక్ష్మీ శరత్ కుమార్.. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి.. మంచి పేరు తెచ్చుకుంది. మంచి మంచి క్యారెక్టర్లు చేసింది. ఇటీవల 'హనుమాన్' లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. కాగా.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది ఈ యాక్టర్. మార్చిలో నిశ్చితార్థం చేసుకుని ప్రియుడిని పరిచయం చేసింది వరలక్ష్మీ. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ ని ఆమె పెళ్లాడబోతున్నారు. అయితే, నిశ్చితార్థం అయిన తర్వాత నుంచి సచ్ దేవ్ పై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. అతని లుక్, తదితర విషయాల గురించి నెగటిల్ గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ విషయాలపై స్పందించారు వరలక్ష్మీ శరత్ కుమార్.
మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు..
సచ్ దేవ్ కి ఇదివరకే పెళ్లి అయ్యింది. దీంతో ఆయనపై విమర్శలు చేశారు చాలా మంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి స్పందించారు. రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించారు ఆమె. అతను సంతోషంగా ఉన్నంత వరకు ఏదీ తప్పు కాదు అని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి రెండు పెళ్లి గురించి ప్రస్తావించారు ఆమె. "మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంట్లో తప్పు ఏముంది?" అని అన్నారు వరలక్ష్మీ. ఇక ఆయన లుక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు చాలామంది. "నా కళ్లకు ఆయన అందంగానే కనిపిస్తున్నారు అది చాలు నాకు" అని చెప్పారు వరలక్ష్మీ. నిజానికి ఇలాంటి నెగటివ్ కామెంట్స్ తను పట్టించుకోనని, గతంలో చాలాసార్లు ఇలాంటివి వచ్చినా రెస్పాన్డ్ అవ్వలేదని ఆమె అన్నారు.
ఆయన ఎక్స్ వైఫ్ తో స్నేహపూర్వకంగా ఉంటాను..
"నిక్ మొదటి భార్యతో కూడా నేను స్నేహపూర్వకంగా ఉంటాను. నిక్ పేరెంట్స్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీని రన్ చేస్తారు. నిక్, ఆయన కూతురు ఇద్దరు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ప్రతీది సక్రమంగా సాగిపోతుంది. నిక్ నన్ను నవ్విస్తాడు, సపోర్ట్ చేస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు. తను నన్ను ప్రేమిస్తాడు, ప్యాంపర్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. మేం 14 ఏళ్ల కిందట కలుసుకున్నాం. అప్పుడు ఇన్ స్టెంట్ గా ఏమీ అనిపించలేదు. మేం డేట్ కూడా చేయలేదు. ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్లం. ఈ మధ్యే ప్రపోజ్ చేశాడు. అప్పుడే ప్రేమ పుట్టింది" అని తనకు కాబోయే భర్త గురించి, లవ్ స్టోరీ గురించి చెప్పారు వరలక్ష్మీ.
14 ఏళ్ల పరిచయం..
వరలక్ష్మీ శరత్ కుమార్.. విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం విలన్ మాత్రమే కాదు.. పాత్ర ఏదైనా అలా ఒదిగిపోతారు ఆమె. తెలుగు, తమిళ్ లో సక్సెస్ ఫుల్ యాక్టరస్ గా రానించారు ఆమె. కాగా.. ఆమె పెళ్లికి సంబంధించి చాలాసార్ల ఎన్నో రూమర్స్ వచ్చాయి. విశాల్ తో ఆమె డేటింగ్ లో ఉన్నారని, అతనితోనే పెళ్లి అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఆ రూమర్స్ ని పటాపంచలు చేస్తూ మార్చిలో షెడన్ గా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది. నిక్, వరలక్ష్మీ దాదాపు 14 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. అయితే, ఇటీవలే ఆయన నార్వేలో ఆమెకు ప్రపోజ్ చేయగా.. యాక్సప్ట్ చేసింది. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరి నిశ్చితార్థం నిర్వహించారు.
Also Read: డ్యాన్స్ షోకు నేహా చౌదరి గుడ్‌బై, అసలు కారణం చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్!