Vaishnavi Chaitanya: ఒకప్పుడు నేను, అమ్మ అలా చేసేవాళ్లం, కీరవాణి తిడతారేమో అనుకున్నా - వైష్ణవి ఎమోషనల్ స్పీచ్

Love Me Audio Launch: ‘లవ్ మీ’ అనే మరో యూత్‌ఫుల్, డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యింది వైష్ణవి చైతన్య. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్‌లో ఎమోషనల్ అవుతూ స్పీచ్ ఇచ్చింది.

Continues below advertisement

Vaishnavi Chaitanya At Love Me Audio Launch: ‘బేబి’ మూవీతో ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌తో, కవర్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న తను హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమానే ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆశిష్ హీరోగా తెరకెక్కిన ‘లవ్ మీ’లో హీరోయిన్‌గా నటించి త్వరలోనే మరోసారి హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. ఇక ఈ మూవీ ప్రెస్ మీట్‌లో వైష్ణవి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అసలు సినిమా ఎప్పుడు, ఎలా ముగిసిందో ఏం అర్థం కాలేదంటూ టీమ్‌లోని ప్రతీ ఒక్కరికీ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పుకుంది. తను హీరోయిన్ కాకముందు పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

Continues below advertisement

జీవితం మారిపోయింది..

‘‘కొన్నేళ్ల ముందు ఆడియో లాంచ్ అంటే చాలా ఆసక్తితో ఎదురుచూసేవాళ్లం. ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని నేను, మా అమ్మ బయట జనాల మధ్యలో నిలబడి సినిమా వాళ్లు కనిపిస్తే చూడాలి, ఒక ఫోటో దిగాలి అనే ఆలోచనలో ఉండేవాళ్లం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్‌కు నేను స్టేజ్‌పై ఉండి మాట్లాడుతున్నాను. జీవితం ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో అర్థం కావడం లేదు. చాలా సంతోషంగా ఉన్నాను. సెకండ్ సినిమాకే ఇంత పెద్దమనుషులతో నేను పనిచేశాను. వీళ్లందరిదీ వేరే లోకం, అక్కడ వరకు మనం రీచ్ అవ్వలేం అనుకునేదాన్ని. కానీ నా సెకండ్ సినిమాకే ఇలాంటి అవకాశం ఇచ్చినందకు థాంక్యూ’’ అని సంతోషం వ్యక్తం చేసింది వైష్ణవి చైతన్య.

తిట్టి పంపించేస్తారేమో అనుకున్నా..

ఇక ‘లవ్ మీ’ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. వైష్ణవి చైతన్య ‘రావాలి రా’ అనే పాటను పాడింది. ఇక కీరవాణితో మొదటిసారి కలిసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది. ‘‘కీరవాణిని మొదటిసారి కలవడానికి చాలా భయపడుతూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక కూర్చొని కాసేపు మాట్లాడాము. ఒక ప్రొఫెషనల్ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక అన్‌ఫ్రొఫెషనల్ సింగర్ వెళ్లి నేను పాట పాడతాను, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, పాడాలని ఎప్పటినుండో ఉంది అనగానే ఒప్పేసుకున్నారు. ముందు నేను పాడడం మొదలుపెడితే నా గొంతు విని తిట్టి పంపించేస్తారేమో అనుకున్నాను. కానీ అలా జరగలేదు. కీరవాణి.. నీ వాయిస్ బాగుంది పిల్ల అనగానే చాలా హ్యాపీ అయిపోయాను’’ అంటూ తన సినిమాలో తనే పాట పాడడం సంతోషంగా ఉందని చెప్పింది వైష్ణవి.

వెటకారం ఎక్కువ..

తనకు పాడడానికి ధైర్యం లేదని, కీరవాణి ఆ ధైర్యం ఇచ్చారని తెలిపింది వైష్ణవి చైతన్య. చిన్నప్పుడు అయ్యప్ప పూజల్లో పాటలు పాడేదాన్ని అని గుర్తుచేసుకుంది. ఇక ‘లవ్ మీ’ కోసం ఏకంగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌ను రంగంలోకి దించింది దిల్ రాజు ప్రొడక్షన్స్. ‘‘పీసీ సార్ ఒకరికి ఫ్రేమ్ పెడితే అదృష్టం చేసుకున్నారని అంటారు. ఆయన మా మొత్తం సినిమా చేసినందుకు మా టీమ్ మొత్తం చాలా అదృష్టం చేసుకుంది’’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించింది వైష్ణవి. ఇక హీరో ఆశిష్ గురించి మాట్లాడుతూ తనకు చాలా వెటకారం ఎక్కువ అని బయటపెట్టింది. ఇక ‘లవ్ మీ’.. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా చూశాక ఇలా కూడా ప్రేమిస్తారా అని ప్రేక్షకులు అనుకుంటారని తెలిపింది వైష్ణవి చైతన్య.

Also Read: శ్రీలీల ప్లేస్‌లో కొత్త హీరోయిన్ - రౌడీ హీరో సరసన 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ!

Continues below advertisement