సంక్రాంతి 2026కి విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా టీం ఒక విషయంలో తప్పటడుగు వేసింది. విడుదలకు ముందు రోజు రాత్రి వరకు తెలుగు సినిమాకు కీలమైన నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అటువంటి తప్పు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం చేయలేదు. స్మార్ట్ స్టెప్ వేసింది. ముందుగా జాగ్రత్తలు తీసుకుంది.
టికెట్ హైక్ కోసం వెయిట్ చేయలేదు!తెలంగాణలో విడుదలకు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు, అలాగే విడుదల రోజు నుంచి వారం పాటు టికెట్ రేట్ హైక్ కోసం 'ది రాజా సాబ్' టీమ్ తీవ్రంగా ట్రై చేసింది. ఆ ప్రయత్నాల్లో బుకింగ్స్ సంగతి మర్చిపోయినట్టు వ్యవహరించింది. స్టార్ హీరోల సినిమాలు అంటే మూడు నాలుగు రోజుల ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేయడం కామన్. అయితే 'ది రాజా సాబ్' సినిమాకు అలా జరగలేదు.
తెల్లవారితే సినిమా విడుదల అనగా... ముందు రోజు రాత్రి ఏడు గంటలకు జీవో వచ్చింది. అప్పటికప్పుడు ప్రెయిడ్ ప్రీమియర్లకు పర్మిషన్ రాలేదు. అప్పటి వరకు బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. దాంతో ఫస్ట్ డే ఓపెనింగ్ మీద ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం అటువంటి తప్పు చేయలేదు. టికెట్ రేట్ హైక్ కోసం గట్టిగా ట్రై చేయలేదు.
Also Read: Harish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల గురువారం అయితే సోమవారం రాత్రి బుకింగ్స్ ఓపెన్ చేసింది. అది కూడా నార్మల్ రేట్లకు. దాంతో ఫస్ట్ డే చాలా థియేటర్లలో ఆల్రెడీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఉగాది సీజన్ కనుక... టాక్ వంటి అంశాలతో సంబంధం లేకుండా మొదటి నాలుగు రోజులు థియేటర్లకు జనాలు వస్తారు. టికెట్ రేట్లు తక్కువ కాబట్టి ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ స్మార్ట్ స్టెప్ వేసిందని చెప్పవచ్చు.
Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
సినిమా టికెట్ రేట్స్ మీద ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఓ సినిమాకు టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తే సామాన్యులకు సినిమా అందుబాటులో లేకుండా చేస్తున్నారని కొంత మంది నుంచి విమర్శలు వ్యక్తం అవుతాయి. టికెట్ రేట్ తగ్గించిన తరుణంలో క్వాలిటీ సినిమా తీయడానికి ఎక్కువ బడ్జెట్ పెట్టామని, ఆ స్థాయిలో టికెట్ రేట్లు లేవని చిత్రసీమ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అందువల్ల, ఎప్పటికీ ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు రావడం సహజం.
