Urfi Javed: విమానంలో మహిళలపై వేధింపులు సెలబ్రెటీలకు మినహాయింపు ఏం కాదు. అందుకు ఉదాహారణ ఈ ఘటన! బాలీవుడ్ నటి విమానంలో ప్రయాణిస్తుండగా.. తనను కొంతమంది వేధింపులకు గురి చేసిన వీడియోను ఆమె తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తాను అందరూ అనుకుంటున్నట్టు పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీని కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ సెలబ్రెటీ ఎవరో కాదు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.


ఇటీవల ముంబై నుంచి గోవా వెళ్తున్న విమానంలో ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed)కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన కొంతమందిని ప్రస్తావిస్తూ... వారు తనను వేధించారని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ఇండిగో విమానంలో చిత్రీకరించిన ఓ వీడియోను పంచుకున్న ఉర్ఫీ జావేద్... తనతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులను చూపించింది. ఈ వీడియోలో కొంతమంది ఆమె పక్కన, ముందు కూర్చున్నారు, మరికొందరు తమ సీట్ల నుండి లేచి నిలబడ్డారు. అందరూ నవ్వుతున్నట్టుగా కనిపిస్తోన్న ఈ వీడియోలో... ఉర్ఫీ సౌండ్ ను మ్యూట్ చేసింది. “నిన్న విమానంలో ముంబై నుంచి గోవాకు ప్రయాణిస్తున్నప్పుడు నేను వేధింపులకు గురయ్యాను. ఈ వీడియోలోని వ్యక్తులు అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ చేస్తూ, అసభ్యమైన పేర్లతో పిలిచారు. పక్కన వారువారిలో కొందరు తాగి కూడా ఉన్నారు. ఇలా మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సబబు కాదు. అవును పబ్లిక్ ఫిగర్ నే. కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు" అంటూ ఉర్ఫీ క్యాప్షన్ లో రాసుకొచ్చింది.


బాలీవుడ్ టీవీ న‌టి, సోషల్ మీడియాలో పాపులర్ ప‌ర్స‌నాలిటీ అయిన ఉర్ఫీ జావెద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హాట్ బ్యూటీగా అభిమానులను సంపాదించుకున్న ఉర్పీ.. అదే స్థాయిలో కాంట్రవర్సీలను కూడా మూట గట్టుకుంది. డిఫరెంట్ స్టైల్ లో డ్రస్సులు మార్చడం.. కొత్త కొత్త వెరైటీ ఫ్యాషన్స్ ను పరిచయం చేయడం... జీన్స్  ప్యాంట్ ను.. టాప్ గా మార్చి వేసుకోవడం.. లాంటి వెరైటీ పనులు చేస్తుంటుంది. అలా బాలీవుడ్ నటుల్లోనే చాలా డిఫరెంట్ అనిపించకుంది ఉర్ఫీ. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలస్తూ వస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ను వివరించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది.


ఉర్ఫీ జావేద్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ పరాస్ కల్నావత్ గురించి కూడా అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసింది. తన కారణంగానే ‘అనుపమ’ సీరియల్ లో అవకాశం కోల్పోయినట్లు వెల్లడించింది. వాస్తవానికి ‘అనుపమ’ సీరియల్ రేటింగ్ లో టాప్ లిస్టులో నిలిచింది. అయితే, ఇందులో తాను కూడా నటించాల్సి ఉండేదని ఉర్ఫీ జావేద్ ఇటీవల చెప్పింది.  ఇందులో తన మాజీ ప్రియుడు పరాస్ కల్నావత్‌తో కలిసి  పని చేయాల్సి ఉందని పేర్కొంది. ఆమెను ఆ సీరియల్‌లోకి తీసుకోవద్దని పరాస్ మేకర్స్‌ని కోరాడని చెప్పింది. అందుకే పరాస్ నుంచి విడిపోయినట్లు చెప్పింది. పరాస్ తో డేటింగ్ చేయడం తాను చేసిన పొరపాటు అని చెప్పుకొచ్చింది.


Read Also : Bhagavanth Kesari Release Date : దసరాకు 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ ఆయుధపూజ - రిలీజ్ డేట్ చెప్పేశారోచ్ 













ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial