Upcoming New Movies In OTT Platforms: ఈ సమ్మర్ ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీస్ సహా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలు ఫిబ్రవరి రెండో వారం సహా మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. కేవలం థియేట్రికల్ రిలీజ్‌లు మాత్రమే కాకుండా నేరుగా ఓటీటీల్లోకి వచ్చే రిలీజ్‌లు సైతం సందడి చేయనున్నాయి. నెట్ ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

మార్చిలో వచ్చే సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాం - ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ మార్చి రెండో వారంలో 'ZEE5' ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ముందుగా టీవీలో ప్రీమియర్ చేసిన అనంతరం ఓటీటీకి ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకోవడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ మార్చి 1 సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేయనున్నట్లు 'జీ తెలుగు' సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆ తర్వాతే ఓటీటీలోకి రిలీజ్ కానుంది. 

Also Read: సెల్ఫీ దిగుతూ నటికి ముద్దు పెట్టేందుకు అభిమాని యత్నం - ఫ్యాన్‌ను పక్కకు నెట్టేసిన హీరోయిన్, వైరల్ వీడియో

తండేల్ - నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 7న విడుదలైన మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' దక్కించుకోగా మార్చి రెండో వారంలో ఓటీటీలోకి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

లైలా - మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా' (Laila). ఈ మూవీలో లేడీ గెటప్‌లో విశ్వక్ నటించారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించారు. 'లైలా' ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.

యాంకర్ సుమ కుకింగ్ షో - అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం 'ఆహా' (Aha) ఈసారి సమ్మర్‌కు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమైంది. టాప్ యాంకర్ సుమ హోస్ట్‌గా.. 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' (CMPK) సీజన్ 4 కుకింగ్ షో మార్చి 6న స్ట్రీమింగ్ కానుంది. 'ఇది జస్ట్ కుకింగ్ షో మాత్రమే కాదు. కుకింగ్, కామెడీ, ట్విస్టులు ఇలా అన్నీ మసాలాలు ఉన్న అల్టిమేట్ కుకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆహ్లాదకరమైన వంటల ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా 'ఆహా' అనౌన్స్ చేసింది.

'3 రోజెస్' వెబ్ సిరీస్ - టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషారెబ్బా, పూర్ణ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్' (3 Roses). 2021లో ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 సైతం ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతోంది. ఈ సిరీస్ మార్చి చివరి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ముందుగా టీవీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' - ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి, ఎప్పుడంటే?