Fan Tries Forcibly Kiss To Poonam Pandey: సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు వారిని అభిమానులు సెల్ఫీలు అడగడం మనం చూశాం. అయితే, కొన్నిసార్లు ఆ అభిమానం మితి మీరుతుంటుంది. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఓ నటితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమాని ఆమెకు ముద్దు పెట్టేందుకు యత్నించాడు. బాలీవుడ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) ఇటీవల ముంబయి నగర వీధుల్లో సందడిగా తిరిగారు. ఓ ఫోటో సెషన్‌లో భాగంగా ఓ చోట విలేకరులతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను సెల్ఫీ అడిగాడు. దీంతో ఆమె అంగీకరించగా సడెన్‌గా ఆమెకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పూనమ్ సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను బలవంతంగా నెట్టేసింది. అలాగే.. ఇది గమనించిన ఓ ఫోటో జర్నలిస్ట్ అతన్ని వెనక్కు లాగేసి ఆమెను రక్షించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సదరు వ్యక్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని.. 'స్క్రిప్టెడ్' అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోను మొదటి నుంచీ గమనిస్తే పూనమ్ పాండే తీరు అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు. ఇదివరకూ కూడా పూనమ్ ఇలాంటి కాంట్రవర్సీలే చాలా వరకూ క్రియేట్ చేశారని పేర్కొంటున్నారు.
Also Read: ఆగస్టుకు వెళ్లిన 'మిరాయ్'... కలిసొచ్చే రెండు పండగలు... తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో..
నటి పూనమ్ పాండే.. వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియాలో ఫోటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ మృతి చెందారంటూ ఆమె వ్యక్తిగత ఖాతాలో సిబ్బంది పోస్ట్ చేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అయితే, ఆ మరుసటి రోజే తాను చనిపోలేదని.. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగానే ఇలా చేసినట్లు ఓ వీడియోలో వివరణ ఇచ్చింది. దీంతో నెటిజన్లతో పాటు అభిమానులు సైతం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం సరికాదని కామెంట్స్ చేశారు. అనంతరం ఈ అంశంపై డిజిటల్ ఏజెన్సీ 'Schbang' సైతం క్షమాపణలు చెప్పింది. ఇన్ స్టా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ చేసిన ప్రచారంలో తాము భాగస్వామ్యమయ్యామని.. దీనిపై క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆమె చర్య వల్లే ఆన్‌లైన్‌లో 'సర్వైకల్ క్యాన్సర్' గురించి ఎక్కువ మంది శోధించినట్లు పేర్కొన్నారు.
పూనమ్ పాండే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 'నషా'తో 2013లో తెరంగేట్రం చేశారు. అనంతరం పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్ ఫస్ట్ సీజన్‌లో పాల్గొన్నారు. 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆమె వైవాహిక జీవితం సైతం వివాదాస్పదమైంది. భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.
Also Read: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?