Srushti Dange: వివక్ష, ఫాల్స్ ప్రామిస్ సహించను... ప్రభుదేవా కాన్సర్ట్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, వైరల్ పోస్ట్

Srushti Dange Comments: స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా కాన్సర్ట్ లో వివక్షను ఎదుర్కొంటున్నానని, ఇకపై షోలో పాల్గొనడం లేదని తమిళ నటి సృష్టి డాంగే ప్రకటించింది.

Continues below advertisement

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చెన్నైలో లైవ్ కాన్సర్ట్ లో పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా దీని గురించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ, అభిమానులందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ప్రభుదేవా మాత్రమే కాదు...  తమిళ నటి, 'చంద్రముఖి 2 హీరోయిన్' సృష్టి డాంగే కూడా ఈ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాజాగా ఈ బ్యూటీ తాను ఈవెంట్ లో పాల్గొనడం లేదని బహిరంగంగా ఓ సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేసింది. అందులో వివక్ష, ఫాల్స్ ప్రామిస్ వంటి కారణాలే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని స్పష్టం చేసింది. 

Continues below advertisement

ప్రభుదేవా కాన్సర్ట్ లో వివక్ష
తాజాగా సోషల్ మీడియాలో సృష్టి చేసిన సుదీర్ఘ పోస్ట్ లో తాను ఈవెంట్లో పాల్గొనక పోవడానికి కారణం ప్రభుదేవా మాత్రం కాదని పేర్కొంది. తను ప్రభుదేవాకు గొప్ప అభిమానిని అంటూనే, ఈవెంట్ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో ఆ నోట్ లో వెల్లడించింది. సృష్టి పోస్ట్ లో "ప్రభుదేవా కచేరిలో నన్ను చూడాలని ఎదురు చూస్తున్న నా అభిమానులకు, ఫాలోవర్స్ అందరికీ... నేను ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. అయితే ప్రభుదేవాను టార్గెట్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకోలేదు. నిజానికి నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయన అభిమానినే. కానీ నేను వివక్షను సహించలేను" అని రాసింది. 

Also Read: ఆ ఊరిలో మర్డర్ కేసుల మిస్టరీ వీడుతుందా? - లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల స్టోరీ, ఆ 2 ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు

నెక్స్ట్ టైమ్ గౌరవప్రదంగా...
అదే నోట్ లో సృష్టి "నెక్స్ట్ టైం బెటర్, హెల్దీ, గౌరవప్రదమైన ప్రదేశంలో కలిసే అవకాశం రావోచ్చేమో" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో పరిశ్రమలోని పర్ఫామర్స్ ను జాగ్రత్తగా చూసుకుంటారని, వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నట్టు సృష్టి వెల్లడించింది. "క్రియేటివ్ టీం ఇందులో పాల్గొన్న ఆర్టిస్టుల గురించి ప్లాన్ చేయడంలో, గౌరవించడంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండు అని నేను కోరుకుంటున్నాను" అని రాసింది. ఫిబ్రవరి 22న శనివారం చెన్నైలోని వైఎంసిఏ గ్రౌండ్స్ లో ప్రభుదేవా పర్ఫార్మ్ చేయబోతున్నారు. అయితే సృష్టి కామెంట్స్ పై ఆయన ఇంకా స్పందించలేదు.

Also Read: కళ్ళ ముందే తిరిగినా పట్టించుకోలేదు... సీక్రెట్ వెడ్డింగ్ గురించి స్పందించిన తాప్సీ

Continues below advertisement