Upasana Konidela about Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంటను చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఉపాసనకు అసలు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ఇద్దరివి రెండు వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్స్. అయినా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటికే తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఉపాసన ఎన్నోసార్లు బయటపెట్టారు. తాజాగా పిల్లలు పుట్టిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది. అసలు ప్రొఫెషనల్ లైఫ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలపై ఉపాసన మాట్లాడారు. తను ఇచ్చిన సలహాలు, సూచనలు చాలామందికి ఉపయోగపడేలా ఉన్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


నేనూ అలాగే చేశాను..


పిల్లల పెంపకంపై ఇప్పటికే ఉపాసన కొణిదెల ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పనిచేసే మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది చాలా ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి వారి అవసరాలకు కంపెనీలు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కోరారు. ఒక వయసు దాటిపోయిన తర్వాత మహిళలు గర్భం దాల్చే విషయంలో సమస్యలు వస్తాయని అందరూ అంటుంటారు. అయితే అలాంటి సమస్యలు ఏమీ లేకుండా, మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎగ్స్ దాచుకునే ప్రక్రియ బెటర్ అని ఉపాసన సలహా ఇచ్చారు. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాతే పిల్లలు కావాలి అని నిర్ణయించుకుంటూ ఎగ్స్‌ను దాచుకోమని, దానికి ఇన్సురెన్స్ కూడా చేయించుకోమని అన్నారు. తను కూడా ఇదే ప్రక్రియను ఫాలో అయ్యానని బయటపెట్టారు. 


కష్టంగా అనిపించేది..


ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చిన ఉపాసన.. రామ్ చరణ్ సక్సెస్‌పై స్పందించారు. ‘‘ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అలాగే తను గెలుస్తున్నప్పుడు తన వెనుక నేను నీడలాగా ఉండడానికి నాకేం  సమస్య లేదు. నా గెలుపు వెనుక కూడా తను అలాగే ఉంటాడు’’ అన తెలిపారు. ఉపాసన.. ఒక మెడికల్, బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కానీ రామ్ చరణ్ మాత్రం సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న నటుడు. అయితే ఇలా వేరే బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై ఆమె వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఒక స్టార్‌ను పెళ్లి చేసుకున్నందుకు కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు.


స్టార్ వైఫ్ కాదు..


‘‘మావి వేర్వేరు ప్రపంచాలు కాబట్టి మొదట్లో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన నీడ అవ్వడం నాకు గర్వంగా ఉంది. తనకోసం అలా మారడం చాలా సంతోషంగా ఉంది. తను కూడా నాకోసం మారాడు. ఆ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. నువ్వు గెలుస్తున్నప్పుడు చాలా విషయాల్లో పోరాడాలి. అలాంటి సమయంలో మనం ఆధారపడడానికి ఒక మనిషి ఉండాలి. ఇక ఉపాసన గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. తను కచ్చితంగా స్టార్ వైఫ్ కాదని, తనకంటూ జీవితంలో చాలా బాధ్యతలు ఉన్నాయని అన్నారు. ఇలా ఒకరికొకరు కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసుకుంటారు కాబట్టే ఈ కపుల్‌ను చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. 2012లో వీరిద్దరి వివాహం జరగగా.. 2023లో వీరిద్దరికీ క్లిన్ కారా జన్మించింది.


Also Read: గామి రివ్యూ: విశ్వక్‌సేన్ అఘోరాగా నటించిన ‘గామి’ ఎలా ఉంది?