దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)జీవితం తెరిచిన పుస్తకం అని పలువురు చెప్పే మాట. అయితే... ఆయన జీవితంలో తెలియని కోణాలను ప్రజలకు పరిచయం చేసేందుకు కొంత మంది దర్శక నిర్మాతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మోదీ మీద గతంలో 'పీఎం నరేంద్ర మోదీ' అని ఓ సినిమా వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ చేశారు. ఇప్పుడు మోదీ మీద మరో బయోపిక్ అనౌన్స్ చేశారు. ఆ మూవీ టైటిల్ 'మా వందే' (Maa Vande Movie).

మోదీగా మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్!Unni Mukundan As Narendra Modi: నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 17వ తేదీన) 'మా వందే' సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించనున్నారు. 

తెలుగు ప్రేక్షకులకూ ఉన్ని ముకుందన్ సుపరిచితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో నటించారు. అందులో మోహన్ లాల్ కుమారుడి పాత్ర చేశారు. 'భాగమతి'లో క్వీన్ అనుష్క శెట్టికి జంటగా నటించారు. అయితే ఇటీవల భారీ యాక్షన్ సినిమా 'మార్కో'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. మోదీగా ఆయన ఎలా నటిస్తారో చూడాలి.

Also Readఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్‌ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!

మోదీ బయోపిక్ 'మా వందే' దర్శకుడు ఎవరు?Maa Vande Movie Director: తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ 'మా వందే' మూవీని తెరకెక్కిస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నిషన్స్ వర్క్ చేయనున్నారు.

Also Readరామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది... విజయదశమి కానుకగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్!

'బాహుబలి'తో పాటు పలు పాన్ ఇండియా సినిమాలకు వర్క్ చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ 'మా వందే'కు ఛాయాగ్రాహకుడు. అలాగే, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా హిట్ సినిమాలకు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంకా భారతీయ భాషలు అన్నిటిలోనూ, అలాగే ఇంగ్లిష్ భాషలోనూ సినిమా విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.