Udayabhanu As Villain Role In Tribanadhari Barbarik Movie: ఉదయభాను... ఒకప్పుడు యాంకర్‌గా తన మాట చాతుర్యంతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. అప్పట్లో ప్రముఖ టీవీషోలకు ఈమెనే యాంకర్‌గా ఉండేవారు. అలా టీవీ షోల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత ఆమె అటు ఈవెంట్స్‌కు గానీ షోల్లో కానీ మూవీస్‌లోనూ కనిపించలేదు.
ఇటీవలే నారా రోహిత్ ప్రతినిధి 2లో ఉదయభాను జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
పవర్ ఫుల్ విలన్‌గా...
చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో 'త్రిబాణధారి బార్బరిక్' మూవీలో విలన్‌గా కనిపించారు ఉదయభాను. బుధవారం ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 'నేను పాలల్లో నీళ్లే కలపతా... విషం కలపా... ల..... కొడకా' అంటూ ఆ డైలాగ్స్‌తో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఆమె రోల్ మాత్రం ఇదివరకూ ఎన్నడూ చూడనదిగా ఉంటుందని అర్థమవుతోంది. మూవీలో ఆమె 'వాకిలి పద్మ' అనే రోల్‌లో కనిపించారు.
ఇప్పటివరకూ ఉదయభాను కేవలం గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌లో మాత్రమే అప్పుడప్పుడూ మూవీస్‌లో కనిపించారు. కానీ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో అలరించారు. లీడర్, ఆపద మొక్కులవాడు, శ్రావణమాసం, ఖైదీ బ్రదర్స్, ప్రతినిధి 2 మూవీస్‌లో నటించారు.
Also Read: తలైవా పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'కూలీ' - ఏ ఓటీటీలోకిి వస్తుందో తెలుసా?
ఈ మూవీలో డాక్టర్ శ్యామ్‌గా సత్యరాజ్, వాకిలి పద్మగా ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్.సింహ, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా... స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి అడిదెల నిర్మించారు.
ట్రైలర్ అదుర్స్
ఓ డిఫరెంట్ కథాంశంతో మూవీ రూపొందినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'చూడు బార్బరికా... ఈ యుద్ధం నీది. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి దండన లభించాలి' అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించే మాటలతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
తాను ప్రాణంగా పెంచుకున్న మనవరాలు కనిపించకుండా పోవడంతో ఆమెను వెతికే క్రమంలో ఆ తాత ఎంతో ఆందోళన చెందుతాడు. 'తోటలో ప్రాణంగా పెంచుకునే గులాబీ మొక్క. ఈ కథలో తోటమాలి సామాన్యుడు అనుకుంటే పొరపాటే...' అంటూ భారీ ఎలివేషన్ మధ్య సత్యరాజ్ ఎంట్రీ అదిరిపోయింది. 'సమస్య నాది అయినప్పుడు సమాధానం నేనే చెప్పాలి.' అంటూ ఆయన చెప్పే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. మిస్సింగ్, మర్డర్, మాఫియా, డ్రగ్స్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ కథకు పురాణాలు లింక్ చేయడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అదృశ్యమైన తన మనవరాలిని వెతికే క్రమంలో ఆ తాతకు ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.