Akkineni Nagarjuna Cries:  ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ఎంత కష్టం వచ్చినా ఆయన ముఖంపై కనిపించనీయరు, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు..ముఖంపై చిరునవ్వు అలానే ఉంటుంది. మాటాల్లోనూ పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. వర్కౌట్స్,డైట్ మాత్రమే కాదు.. టెన్షన్ పడకపోవడం కూడా తన గ్లామర్ సీక్రెట్ అంటారాయన. అందుకే 65 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడిగా వెలుగుతున్నారు. 

బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నప్పుడు తప్పితే నాగార్జున కాస్త గట్టిగా, సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఇంటర్యూస్ లోనూ సరదాగా సాగిపోతారు. ఏ విషయాన్ని తలకెక్కించుకోను అని చెబుతుంటారు. అలాంటి నాగార్జున ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ నాగార్జున కన్నీళ్లు పెట్టుకోవాడానికి కారణం ఏంటంటే..తండ్రి అక్కినేని నాగేశ్వరరావుని తల్చుకుని ఎమోషనల్ అయ్యారు.

సీనియర్ హీరో జగపతి హోస్ట్ గా జీ తెలుగు ‘జయమ్ము నిశ్చయమ్ము’ అనే షో స్టార్ట్ చేసింది. ఆగష్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకి ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు నాగార్జున. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. లేటెస్ట్ గా సెకెండ్ ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోలో భాగంగా నాగ్ చిన్నప్పటి స్కూల్ నుంచి మొదలుపెట్టి, కాలేజ్, కెరీర్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా క్వశ్చన్స్ సందించారు జగపతిబాబు. సిగ్గులేకుండా మాట్లాడుకునే షో అంటూ రిలాక్స్ మొదలుపెట్టారు..నాగ్ కూడా అంతే ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. ఫస్ట్ ప్రోమో ఫన్నీగా సాగితే..రీసెంట్ గా వచ్చిన సెకెండ్ ప్రోమో ఎమోషనల్ గా సాగింది.  

అక్కినేని నాగేశ్వర రావు గారికి తనయుడిగా పుట్టినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగారు జగపతిబాబు?ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘అంత ఈజీ కాదు..ఎదో ANR గారి కొడుకు అనుకుంటున్నావేమో’ అంటూ దానికి కొనసాగింపు ఏంటన్నది పాజ్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ నా సోదరుడు వెంకట్.. తమ్ముడూ నువ్వు ఎందుకు సినిమాల్లోకి రాకూడదని అడిగారు. ఎస్ కచ్చితంగా చేద్దాం అనుకుని నాన్నగారి దగ్గరకు వెళ్లి కూర్చుని సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నా అని చెప్పాను. అప్పుడు నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు నాగార్జున. అన్నమయ్య సినిమా చూసిన తర్వాత మా నాన్నగారు నా చేతులు పట్టుకుని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది అని జగపతిబాబుతో షేర్ చేసుకున్నారు.  ఆయన ఎలా బతకాలి అనుకున్నారో అలానే బతికారంటూ అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజులను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ రిలీజైన ప్రోమోలో..కూలీ సినిమా గురించి మాట్లాడిన డైలాగ్స్ హైలెట్ అయ్యాయ్. రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన కూలీ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు నాగార్జున. ఇప్పటివరకూ మన్మధుడిగా స్టార్ హీరోగా వెలిగిన నాగార్జున కుబేర మూవీతో ఫస్ట్ టైమ్ నెగెటివ్ షెడ్స్ రోల్ చేశారు..ఇప్పుడు కూలీలో పూర్తిస్థాయిలో నెగెటివ్ రోల్ చేశారు. ఆగష్టు 14 థియేటర్లలోకి వచ్చేసిన కూలీపై ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ సహా..అన్ని ఇండస్ట్రీలో నటులను కవర్ చేసేసి సౌత్, నార్త్ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.