ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆర్.బి. చౌదరి (RB Choudary) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి టీవీకే పార్టీ అధినేత, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజయ్, చెన్నైలోని టి నగర్‌లో ఉన్న ఆర్.బి. చౌదరి నివాసానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. చౌదరి తనయుడు, హీరో జీవాను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భావోద్వేగానికి లోనైన జీవా...కన్నీటి పర్యంతానికి లోనైన విజయ్సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరి మే 5, 2026న మరణించారు. రాజస్తాన్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భౌతిక కాయాన్ని చెన్నైలోని టి నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి తీసుకువచ్చారు. తండ్రి మరణం వల్ల జీవా తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయనను విజయ్ ఓదార్చారు. ఆ క్రమంలో విజయ్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
విజయ్, జీవా మధ్య మంచి అనుబంధం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత విజిల్ వేస్తూ సెలబ్రేట్ చేశారు జీవా. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 5న జీవా తండ్రి మరణించారు.
Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?
'స్నేహితుడు'లో విజయ్, జీవా...చౌదరి నిర్మాణంలోనూ సూపర్ హిట్!శంకర్ దర్శకత్వం వహించిన 'నన్బన్' గుర్తు ఉందా? తెలుగులో 'స్నేహితుడు'గా డబ్ చేశారు. అందులో విజయ్, జీవా కలిసి నటించారు. అది హిందీ సినిమా '3 ఇడియట్స్' రీమేక్. అంతే కాదు... 'పూవే ఉనక్కాగ' (1996)తో విజయ్ భారీ హిట్ అందుకున్నారు. ఆయన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమా నిర్మాత ఆర్.బి. చౌదరియే.
Also Read: Spirit Release Date Update - 'స్పిరిట్' వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ సినిమా టీమ్
ఆర్.బి. చౌదరి తనయుడిగా, కథానాయకుడిగా జీవా తమిళ చిత్రసీమలో అడుగు పెట్టారు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన 'యాత్ర' సీక్వెల్ 'యాత్ర 2' సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటించారు. ఆర్.బి చౌదరికి భార్య మహజబీన్, జీవా కాకుండా మరో ఇద్దరు కుమారులు రమేష్, సురేష్ ఉన్నారు.
Also Read: Palash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు
